MLC Varudu Kalyani: చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు మాయా శక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Varudu Kalyani: చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు.. మాయా శక్తి అంటూ విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ వరుదు కల్యాణి.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె… కాల్ మనీ సెక్స్ రాకెట్స్ నిందితులకు పెద్దపీట వేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు మాటలను చూసి ప్రజలు సిగ్గు పడుతున్నారన్న ఆమె.. చంద్రబాబు కుటుంబంలో వాలంటీర్లు ఏమైనా గొడవలు పెట్టారా..? అని ప్రశ్నించారు.. చంద్రబాబు, లోకేష్ వేర్వేరుగా కాపురం ఉండడానికి వాలంటీర్లు ఏమైనా కారణమా..? భువనేశ్వరి, బ్రాహ్మణి మధ్య గొడవలకు వాలంటీర్లు ఏమైనా కారణమా..? లోకేష్ తో గొడవ పడి చంద్రబాబు ఫామ్‌హౌస్‌లో కాపురం ఉండడానికి వాలంటీర్లు ఏమైనా కారణమా..? అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, మహిళల పట్ల గౌరవం లేని సంస్కారహీనుడు పవన్ కల్యాణ్ అంటూ ఫైర్ అయ్యారు.. పవన్ తల్లిని చంద్రబాబు, లోకేష్ దారుణంగా అవమానించారు.. సిగ్గు లేకుండా అదే తెలుగుదేశం పార్టీతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుంటున్నారంటూ మండిపడ్డారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కల్యాణి.
Read Also: Minister Ambati Rambabu: పవన్ ఏకపత్నీవ్రతుడు.. ఏక కాలంలో ఒక పత్నీనే ఉంటుంది..!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కాగా, టీడీపీ పాలనతోనే మహిళా సంక్షేమం సాధ్యమైందని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం విదితమే.. మహిళా సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు… తెలుగుదేశం ఆవిర్భావం తరవాత అని చూడాల్సిన అవసరం ఉందన్నారు.. మేనిఫెస్టో మహాశక్తి పథకాలపై సదస్సు నిర్వహించిన చంద్రబాబు.. అనంతరం మహాశక్తి చైతన్య రథయాత్రను ప్రారంభించారు. నా మహాశక్తి రథసారథులు ఆడబిడ్డలే. ఆవిర్భావం నాటి నుంచి తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. నేడు మహాశక్తి తీసుకొస్తున్నా. మహాశక్తి పదం నా మనసులో నుంచి వచ్చిందని.. రాష్ట్రంలోని మహిళల స్థితిగతులను మహాశక్తి కార్యక్రమం ద్వారా మార్చేస్తాం అన్నారు.. ఆనాడు 1986లో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. ఆ తర్వాత కాలంలో ఆస్తి హక్కును దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని చంద్రబాబు గుర్తుచేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!