NTV Telugu Site icon

MLC Sipai Subramanyam: వైసీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్‌..! వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ సిపాయి..

Mlc Sipai Subramanyam

Mlc Sipai Subramanyam

MLC Sipai Subramanyam: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కిడ్నాప్‌నకు గురయ్యారనే పుకార్లు షికారు చేశాయి.. అయితే, కిడ్నాప్‌ వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ.. క్లారిటీ ఇచ్చారు.. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు అంటూ ఓ వీడియో విడుదల చేశారు.. అనారోగ్యంగా కారణంగా.. ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు.. ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను.. వైద్యులు డిశ్చార్జ్‌ చేయగానే వస్తాను.. అయితే, నా ఆరోగ్యం గురించి గానీ, నేను కిడ్నాప్‌నకు గురయ్యాననే వార్తలపై గానీ, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని.. ప్రజలు, అధికారులు, మీడియాకు విడుదల చేసిన ఆ వీడియోలో పేర్కొన్నారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం..

Read Also: Gongidi Trisha: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న అండర్ 19 విమెన్ ప్లేయర్స్.. స్వాగతం పలికిన హెచ్ సీఏ

కాగా, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠ రేపుతూనే ఉంది.. షెడ్యూల్‌ ప్రకారం నిన్నే ఎన్నిక జరగాల్సిన ఉన్నా.. ఇవాళ్టికి వాయిదా పడింది.. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అదృశ్యమయ్యారని.. గత అర్థరాత్రి నుంచి అతను కనిపించకుండా పోయారని, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉందని అతని అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం.. కాగా, నేడు మరోసారి తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.. కోరం లేకపోవడంతో నిన్నటి రోజున ఎన్నికను ఇవాళ్టికి వాయిదా వేశారు ఎన్నికల అధికారి… కూటమి వైపు మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉండగా.. డిప్యూటీ మేయర్ పదవిని చేజిక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 25గా ఉంది.. నిన్నటి రోజున ఎన్నికల కేంద్రానికి వస్తున్న వైసీపీ కార్పొరేటర్లలో నలుగురు అదృశ్యం… టీడీపీ నేతలు.. నలుగురు వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారనే ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించాయి.. అయితే, తాము క్షేమంగానే ఉన్నామని, గొడవలు చూసి భయపడి వచ్చేశామని సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు నలుగురు వైసీపీ కార్పొరేటర్లు..

Read Also: Tollywood : ఆ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పై టాలీవుడ్ నిర్మాతల గరం గరం

మరోవైపు, తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ నిన్న మధ్యాహ్నం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. అదృశ్యమైన నలుగురు కార్పొరేటర్ లను భారీ భద్రత నడుమ ఎన్నికల కేంద్రానికి తీసుకురావాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు.. నలుగురు కార్పొరేటర్లు ఇవాళ ఎన్నికకు హాజరు కావడంపై ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.. ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని వైసీపీ భావిస్తుండగా.. డిప్యూటీ మేయర్ పీఠం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి కూటమి పార్టీలు.. ఈ నేపథ్యంలో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.