Vasantha Krishna Prasad: అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒకే చర్చ.. సీటు ఉంటుందా? మారుతుందా? ఇంకా ఎవరైనా కొత్త ఇంఛార్జ్ వస్తాడా? మంత్రులు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఇలా అందరిలోనూ ఒకటే టెన్షన్.. అయితే, ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.. ఇప్పటికే పలుమార్లు పార్టీ నేతలతో బుజ్జగించే ప్రయత్నాలు చేసింది వైసీపీ అధిష్టానం.. నిన్న, ఇవాళ కూడా సీఎంవోకి రావాలని వసంత కృష్ణప్రసాద్‌కు సమాచారం పంపింది అధిష్టానం.. కానీ, ఆయన అధిష్టానం పిలుపుపై అంత ఆసక్తిగా లేనట్టు స్పష్టమైంది.. ఎందుకంటే.. ఆయన హైదరాబాద్‌లోనే ఉండిపోయారు..
Read Also: Prithviraj Sukumaran: ప్రభాస్ లో నాకు అదే నచ్చలేదు.. చాలా డేంజరస్ పర్సన్
మరోవైపు, ఇప్పటికే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య వివాదం.. పలుమార్లు పార్టీ అధిష్టానం వరకు వెళ్లింది.. నేతలు బుజ్జగించి పంపండం.. మళ్లీ కొన్నాళ్లకు అదే పరిస్థితి కృష్ణప్రసాద్ ఎదుర్కొన్నారనే విమర్శలు వచ్చాయి.. ఇప్పుడు ఉన్నట్టుండి.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలంటూ వసంత కృష్ణప్రసాద్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.. దీంతో.. వసంతను బుజ్జగించి సీఎంవోకి రప్పించేందుకు రంగంలోకి దిగారు పార్టీ కీలక నేతలు. మరోవైపు.. రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలకు కూడా దూరంగా ఉండాలని వసంత కృష్ణప్రసాద్ నిర్ణయం తీసుకున్నారట.. దీంతో.. తాను సీఎంవోకు వెళ్లినా? నాకు సీటు రాదనే ఉద్దేశంతోనే వసంత కృష్ణప్రసాద్ సీఎంవోకు వెళ్లడం లేదా? మరేదైనా ఉద్దేశాలు ఉన్నాయా? అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.