NTV Telugu Site icon

Amalapuram: అమెరికా నుంచి అమలాపురానికి ఐదు మృతదేహాలు.. బోరున విలపించిన ఎమ్మెల్యే

Ponnada Satish Babu

Ponnada Satish Babu

Amalapuram: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అమలాపురానికి చెందిన ఐదుగురు మృతిచెందారు.. ఒకే కుటంబానికి చెందిన ఐదుగురు మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.. మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చిన్నాన కుటుంబ సభ్యులు.. ఎమ్మెల్యే చిన్నాన్న, చిన్నమ్మ, వాళ్ల కుమార్తె, మనవడు, మనవరాలు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు.. పొన్నాడ నాగేశ్వరరావు (68) సీతా మహాలక్ష్మి (65), నవీన (38), కృతిక్ (11), నిషిధ (9).. మృతదేహాలు ఈ రోజు అమలాపురం హౌసింగ్ బోర్డులో ఉంటున్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి చేర్చారు.. ఒక్కసారిగా ఆ మృతదేహాలను చూసి బోరున విలపించారు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌.. కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే సతీష్‌ కన్నీరు మున్నీరుగా విలపించారు.. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ వెక్కి వెక్కి ఏడ్చారు.. ఆయన్ని పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఓదార్చారు..

Read Also: Kishan Reddy: సీఎం మీకు చిత్త శుద్ది ఉందా? సీబీఐ విచారణకు లేఖ రాస్తారా లేదా…

కాగా, ఐదు రోజుల క్రితం టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సతీష్‌ కుటుం సభ్యులు ఐదుగురు దుర్మరణం చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఎమ్మెల్యే సతీష్‌ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబసభ్యులు. నాగేశ్వరరావు చిన్న కుమార్తె నవీన గంగ, అల్లుడు లోకేష్‌తో పాటు ఇద్దరు పిల్లలు టెక్సాస్‌లో ఉంటున్నారు. 6 నెలల క్రితం అమలాపురం వచ్చిన కుమార్తె నవీనతో కలిసి తండ్రి నాగేశ్వరరావు, తల్లి సీతామహాలక్ష్మి అమెరికా వెళ్లారు.. అక్కడ జరిగిన ప్రమాదంలో నాగేశ్వరరావు, సీతామహాలక్ష్మి, కుమార్తె నవీనతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. అల్లుడు లోకేష్‌ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.. అతడి పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్టు చెబుతున్నారు.. కానీ, ఒకేసారి ఐదుగురు కుటుంబసభ్యుల మృతితో అమలాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. మృతదేహాలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ నివాళులర్పించారు.. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుటుంబాన్ని పరామర్శించారు. రాజమండ్రి కోటిలింగాల ఘాట్ లో కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఏర్పాట్లు చేశారు.

Show comments