NTV Telugu Site icon

Nallapareddy Prasanna Kumar Reddy: చంద్రబాబుకు ఆ శాపం తగిలింది..

Nallapareddy Prasanna Kumar

Nallapareddy Prasanna Kumar

Nallapareddy Prasanna Kumar Reddy: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఉంటూ దోపిడీ చేసి సంపాదించి కోటీశ్వరుడు అయిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. సీబీ సీఐడీ చేతిలో చిక్కి రాజమండ్రి జైలులో కూర్చున్నాడు.. నేను తప్పు చేసినా.. మా నాయకుడు తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుని పోతుందని స్పష్టం చేశారు. అయితే, మనం ఏ పార్టీ అయినా ఎన్టీ రామారావుని గౌరవించాల్సిందే.. కానీ, వైస్రాయ్ హోటల్ వద్ద భగవంతుడికి సమానమైన ఎన్టీ రామారావు మీద చెప్పులు వేయించి మానసికంగా ఎన్టీ రామారావు చనిపోయే దానికి కారకుడు అయ్యాడు చంద్రబాబు.. నమ్మి ఆడబిడ్డని ఇచ్చి అల్లుడ్ని చేసుకుంటే పదవి వ్యామోహంతో ఆయనకే మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Mama Mascheendra: ఇండియన్ సినీ హిస్టరీలోనే ‘‘మామా మశ్చీంద్ర’’ ప్రయోగం

ఎన్టీ రామారావు మీద చెప్పులు వేయించి.. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి చంద్రబాబుకు కష్టకాలం మొదలైందన్నారు నల్లపరెడ్డి.. మనం కోరుకోకూడదు గాని భయంకరమైన చావు చావాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీ రామారావు మీద చెప్పులు వేయించినందుకు… ఈరోజు చంద్రబాబు కోసం ఎన్టీఆర్‌ కొడుకులు.. కోడళ్లు, కూతుర్లు అందరూ రోడ్లు మీదకు వచ్చారు.. ఎన్టీ రామారావు కుటుంబానికి సంబంధించిన కొడుకులు.. కూతుర్లు, కోడళ్లని అడుగుతున్నా.. ఆ రోజు వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీ రామారావు మీద చెప్పులు వేశారు కదా మీరందరూ ఎందుకు చంద్రబాబుకి కొమ్ముకాచారు అంటూ నిలదీశారు. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే మీ కుటుంబం అంతా రోడ్లమీదకు వచ్చి నానా రభస చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. అప్పట్లో అన్ని జిల్లాల్లో చంద్రబాబు నాయుడుకి పలువురు ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు.. చివరి వరకూ ఎన్టీరామారావు దగ్గరే నేనున్నాను.. నాతో పాటు దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. చెప్పు లేసిన తర్వాత ఎన్టీ రామారావు ఇంటికి వచ్చాడు. సోపా మీద తల వాల్చేసి ఈరోజుతో ఎన్టీ రామారావు చనిపోయాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అందరం ఏడ్చామని గుర్తుచేసుకున్నారు. అంతటి మహానుభావుడిని. ఏడిపించినందుకు చంద్రబాబుకు శాపం తగిలిందన్నారు. ఇక, ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని పవన్ కల్యాణ్‌, చంద్రబాబు నాయుడులు కలిసి రంగంలో దిగాలని నిర్ణయం తీసుకున్నారు.. వారు ఇద్రదూ తోడుదొంగలు అంటూ ఆరోపించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.