NTV Telugu Site icon

Malladi Vishnu: సీఎం జగన్‌ సర్కారును చూసి బీజేపీ, జనసేన, టీడీపీ భయపడుతున్నాయి..

Malladi Vishnu

Malladi Vishnu

Malladi Vishnu: సీఎం జగన్ ప్రభుత్వాన్ని చూసి బీజేపీ, జనసేన, టీడీపీ భయపడుతున్నాయని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రతిపక్షాల సంక్షేమం అభివృద్ధిపై గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. పురంధేశ్వరి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆయన అన్నారు. నిధులంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు పురంధేశ్వరి బిల్డప్‌ ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Also Read: Merugu Nagarjuna: దళిత సంక్షేమాన్ని అపహాస్యం చేసింది చంద్రబాబే..

లోకేష్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా పూర్తి రీయింబర్స్‌ విడుదల చేశారా అని ఆయన ప్రశ్నించారు. నారాయణ, చైతన్య కళాశాలలకు టీడీపీ కొమ్ము కాసిందన్నారు. పేదవాళ్లు స్కూల్‌కెళ్లి చదువుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ఒక అడుగున ముందుకు వేసిందా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను టీడీపీ నేతలు కాపీ కొడుతున్నారన్నారు.