MLA Koneti Adimulam: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే.. తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లారట.. తిరుపతి జిల్లా సత్యవేడు (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన అధికార వైసీపీకి చెందిన శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం.. ఈ మధ్యే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారు.. మంత్రి పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి దళితులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, వారికి ఇష్టానుసారంగా షరతులు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే.. అయితే, ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సిద్ధమయ్యారనే చర్చ సాగుతోంది.. మరో రెండు, మూడు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని అనుచరులు చెబుతున్నమాట..
Read Also: Kidnap Case: సీఐడీ అధికారులమంటూ ఐటీ కంపెనీ యజమాని కిడ్నాప్.. అడ్డంగా బుక్కైన కేటుగాళ్లు
ఇప్పటికే టీడీపీ నేతలకు టచ్ లో వెళ్లారట ఆదిమూలం.. వైసీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే సీటు కాకుండా ఎంపీ స్థానాన్ని ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న ఆదిమూలం.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. పార్టీలో కనీస గౌరవం ఇవ్వలేదని.. జిల్లా రెడ్లుదే రాజ్యం అంటూ విమర్శలు గుప్పించారు. ఇక, ఎమ్మెల్యే ఆదిమూలం మాటలకు కౌంటర్ ఇచ్చారు తిరుపతి ఎంపీ గురుమూర్తి .. ఎమ్మెల్యే నుండి ఎంపీ సీటు ఇస్తే… ఆదిమూలం అవకాశవాద రాజకీయ చేస్తున్నారని మండిపడ్డారు. గౌరవం ఇచ్చిన పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో మాట్లాడుకునే ఇలా మాట్లాడారన్న ఎంపీ గురుమూర్తి ధ్వజమెత్తారు.
Read Also: Vizag Test: గిల్‌పై వేటు.. పాటిదార్, సర్ఫరాజ్ ఎంట్రీ!
కాగా, సీఎం వైఎస్ జగన్, మంత్రి రామచంద్రారెడ్డి నన్ను పట్టించుకోకుండా తిరుపతి (ఎస్సీ) లోక్‌సభ స్థానానికి మార్చి నన్ను మోసం చేశారు.. రోజా, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అన్యాయం చేయగలరా? అని ప్రశ్నించిన విషయం విదితమే.. తన సంస్కరణను పరిగణనలోకి తీసుకోకుండా తిరుపతి (ఎస్సీ) లోక్‌సభ స్థానానికి మార్చడం ద్వారా మంత్రి మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను మోసం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. నాపై జగన్ మోహన్ రెడ్డికి ప్రతికూల నివేదికను రామచంద్రారెడ్డి అనుచరులు సిద్ధం చేశారని ఆరోపించారు. వీరంతా సత్యవేడు నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే.