Andhra Pradesh: ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఆదివారం వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎలీజాను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి ఎలీజాను పార్టీలోకి ఆహ్వానించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎలీజా వైఎస్సార్‌సీపీ టికెట్ నిరాకరించింది. మరో అభ్యర్థి కంభం విజయరాజుకి సీటు ఇవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వైసీసీకి గుడ్ చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
Read Also: Pemmasani Chandrashekar: గుంటూరు జిల్లా తెలుగు యువత క్యాడర్‌తో పెమ్మసాని మీట్ అండ్ గ్రీట్
ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ.. సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేశారని అన్నారు. తనను ఇబ్బందులకు గురిచేశారని, పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవలేదని, తనకు సమాచారం లేకుండానే రీజనల్ కో ఆర్డినేటర్ సమావేశాలు పెట్టారని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని చాలాసార్లు మా అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లినా. సరైన స్పందన లేదన్నారు. తన అవసరం పార్టీకి లేదేమో అనిపించిందని.. అందుకే వైసీపీను వీడానన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నానని ఆయన పేర్కొన్నారు. చింతలపూడి నుంచి కాంగ్రెస్ బరిలో ఉంటానన్న ఆయన… షర్మిల తనకు టికెట్ హామీ ఇచ్చారన్నారు.