NTV Telugu Site icon

Grandhi Srinivas: టీడీపీతో పవన్‌ సహజీవనం.. చిరంజీవి మీలా ఎవరినీ మోసం చేయలేదు..!

Grandhi Srinivas

Grandhi Srinivas

Grandhi Srinivas: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. ఈ రోజు సాయంత్రం భీమవరంలో వారాహి విజయయాత్రలో ప్రసంగించనున్న విషయం విదితమే కాదు.. ముందుగానే పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు లోకల్‌ ఎమ్మెల్యే గ్రంధి… పవన్ కల్యాణ్‌, చంద్రబాబుకు కావాల్సింది పెత్తందార్లు మాత్రమే.. పేదల కష్టాలు వారికి అవసరం లేదని విమర్శించారు.. వారాహి యాత్రలో రెండు చెప్పులు పోయాయి అంటున్న పవన్.. ప్యాకేజీ స్టార్ అని అందరికీ తెలుసు.. చంద్రబాబు ఇంటికి వీధి గుమ్మంలో వెళ్లిన పవన్.. ప్యాకేజీ తీసుకుని దొడ్డి దారిన వెళ్లిపోయారు. అక్కడే రెండు చెప్పులు వదిలేశారు.. చంద్రబాబు ఇంటికి వెళ్లి వెతికితే ఆ రెండు చెప్పులు దొరుకుతాయి అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, పవన్ కల్యాణ్‌ ఎల్‌కేజీ లో చేర్పించేందుకు వయసు నిబంధన సడలిస్తు జీవో ఇవ్వమని ముఖ్యమంత్రికి విన్నవిస్తాను అంటూ సెటైర్లు వేశారు.

Read Also: Adipurush :14 వ రోజుకు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

పార్టీలు పెరిగితే ప్రజాస్వామ్యానికి మంచిది.. కానీ, పార్టీని ప్యాకేజీ కోసం అమ్మేయడం సరికాదని వ్యాఖ్యానించారు గ్రంధి శ్రీనివాస్‌.. ఎప్పుడు ఏం మాట్లాడతారో పవన్ కే అర్థం కాదన్న ఆయన.. గుడ్డలు ఊడదీసి కోడతాను అనేది వైసీపీకి ఓటు వేసిన వారినా..? లేక మిమ్మల్ని, చంద్రబాబుని ఓడించిన ప్రజలనా..? అని నిలదీశారు. పవన్ అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపెస్తే.. మీరు టీడీపీతో సహజీవనం చేస్తున్నారని విమర్శించారు. అయితే, చిరంజీవి ఎవరినీ మోసం చేయలేదు… కానీ, పవన్ అడుగడుగునా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.. అభిమానిగా పవన్ కల్యాణ్‌ని కోరేది ఒక్కటే.. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని సూచించారు.

Read Also: Vijayashanthi: ఎమ్మెల్యే రాజాసింగ్‌ సస్పెన్షన్‌ పై విజయశాంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కుటుంబానికి ఆధారంగా వుండే యువతకు పీకపిసికేయండి, మక్కేలు ఇరగకొట్టండి అంటూ రౌడీయిజం నేర్పిస్తున్నారు అంటూ పవన్‌పై ఫైర్‌ అయ్యారు గ్రంధి శ్రీనివాస్.. యువతను రెచ్చగొట్టి వారి జీవితాలు నాశనం చేయకండి అని సూచించారు. యువతకు ఎప్పుడైనా మంచి సలహా ఇచ్చారా.? సీఎం రాష్ట్రంలోని పిల్లల చదువులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.. తన సభకు వచ్చేవారిపై పవన్ కు అనుమానం.. అందుకే మీరంతా నాకు ఓట్లు వేయలేదని అవమనిస్తుంటారు అని విమర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్‌ జగన్ లా మీరు పాదయాత్ర చేయండి అని సూచించారు. ఇక, జ్వరం అని చెబుతూ, సినిమాలకి డబ్బింగ్ పూర్తి చేసి మరోసారి అభిమానులను మోసం చేశారని ఆరోపించారు. పవన్ చెబితే తెలుసుకోవాల్సినంత అమాయకులు కాదు భీమవరం వాళ్లు అని వార్నింగ్‌ ఇచ్చారు. నాదెండ్ల భాస్కర్ వెన్నుపోటు పేటెంట్ రైట్ ఉన్నవాళ్లు, ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ రాసినవి పవన్ చదువుతున్నారు.. వెన్ను పోటు దారులు, భూ కబ్జాదారులు, మద్యం వ్యాపారాలు వంటివి చేసేవాళ్లు రాసినవి పవన్ చదువుతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌.

Show comments