Dwarampudi Chandrasekhar Reddy: లోకేష్‌కి ద్వారంపూడి సీరియస్ వార్నింగ్.. నాలుక కట్ చేస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dwarampudi Chandrasekhar Reddy: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. లేనిపోని ఆరోపణలు చేస్తే లోకేష్ నాలుక కట్ చేస్తాను అంటూ హెచ్చరించారు. లోకేష్ కొవ్వు కరిగించుకోవడానికి పాదయాత్ర చేస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. నీ ఎర్ర బుక్ మడత పెట్టుకో.. కాకినాడలో దొంగ బియ్యం ఎగుమతి అవుతుందో లేదో.. పయ్యావుల వియ్యంకుడైన సైరస్ కంపెనీ యాజమాని శ్రీనివాస్ ను అడుగు అని సూచించారు. ఆయన కాకినాడలో టాప్ త్రీ రైస్ ఎక్స్‌పోర్టర్.. మీ సామాజిక వర్గమే అన్నారు.
Read Also: Nani: కడపలోని పెద్ద దర్గాను సందర్శించిన నాని.. పిక్స్ వైరల్..
Also Read
ఇక, తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్ ప్రభావం లేదన్నారు ద్వారంపూడి.. సెటిలర్లు, టీడీపీ వాళ్లు బీఆర్ఎస్ ను ఆదరించారు.. కానీ, టీడీపీని సపోర్ట్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల వల్ల కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్నారు.. రేవంత్ రెడ్డికి టీడీపీ మచ్చ ఉంటే ఎంతోకాలం సీఎంగా ఉండలేడంటూ జోస్యం చెప్పారు.. మరోవైపు.. తెలంగాణ ఎన్నికల్లో పరాజయానికి పవన్ కల్యాణ్‌కు కంగ్రాట్స్ చెబుతూ సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాగా, యువగళం పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడిన నారా లోకేష్.. ఎమ్మెల్యే ద్వారంపూడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. కాకినాడ రూరల్ లో ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా చెయ్యలేదు.. ఇక, కాకినాడ సిటీ అభివృధి జరగలేదు.. కానీ, ద్వారంపూడి కుటుంబం బాగుపడిందని ఆయన దుయ్యబట్టారు.. ప్యారడైజ్ సిటీని డ్రగ్స్ సిటీగా మార్చేశారు.. చంద్రశేఖర్ రెడ్డి పేరు దోపిడీ శేఖర్.. చేయని అవినీతి లేదు. సీఎం వైఎస్ జగన్ కి బినామీనే ఈ దోపిడీ శేఖర్ అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!