Site icon NTV Telugu

Dwarampudi Chandrasekhar Reddy: లోకేష్‌కి ద్వారంపూడి సీరియస్‌ వార్నింగ్‌.. నాలుక కట్‌ చేస్తా..!

Dwarampudi

Dwarampudi

Dwarampudi Chandrasekhar Reddy: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. లేనిపోని ఆరోపణలు చేస్తే లోకేష్ నాలుక కట్ చేస్తాను అంటూ హెచ్చరించారు. లోకేష్ కొవ్వు కరిగించుకోవడానికి పాదయాత్ర చేస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. నీ ఎర్ర బుక్ మడత పెట్టుకో.. కాకినాడలో దొంగ బియ్యం ఎగుమతి అవుతుందో లేదో.. పయ్యావుల వియ్యంకుడైన సైరస్ కంపెనీ యాజమాని శ్రీనివాస్ ను అడుగు అని సూచించారు. ఆయన కాకినాడలో టాప్ త్రీ రైస్ ఎక్స్పోర్టర్.. మీ సామాజిక వర్గమే అన్నారు.

Read Also: Nani: కడపలోని పెద్ద దర్గాను సందర్శించిన నాని.. పిక్స్ వైరల్..

ఇక, తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్ ప్రభావం లేదన్నారు ద్వారంపూడి.. సెటిలర్లు, టీడీపీ వాళ్లు బీఆర్ఎస్ ను ఆదరించారు.. కానీ, టీడీపీని సపోర్ట్ చేసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల వల్ల కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్నారు.. రేవంత్ రెడ్డికి టీడీపీ మచ్చ ఉంటే ఎంతోకాలం సీఎంగా ఉండలేడంటూ జోస్యం చెప్పారు.. మరోవైపు.. తెలంగాణ ఎన్నికల్లో పరాజయానికి పవన్ కల్యాణ్‌కు కంగ్రాట్స్ చెబుతూ సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాగా, యువగళం పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడిన నారా లోకేష్.. ఎమ్మెల్యే ద్వారంపూడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. కాకినాడ రూరల్ లో ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా చెయ్యలేదు.. ఇక, కాకినాడ సిటీ అభివృధి జరగలేదు.. కానీ, ద్వారంపూడి కుటుంబం బాగుపడిందని ఆయన దుయ్యబట్టారు.. ప్యారడైజ్ సిటీని డ్రగ్స్ సిటీగా మార్చేశారు.. చంద్రశేఖర్ రెడ్డి పేరు దోపిడీ శేఖర్.. చేయని అవినీతి లేదు. సీఎం వైఎస్‌ జగన్ కి బినామీనే ఈ దోపిడీ శేఖర్ అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే.

Exit mobile version