NTV Telugu Site icon

Prasanna Kumar Reddy: సీఎంగా జగన్‌ మళ్లీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు..

Prasanna Kumar Reddy

Prasanna Kumar Reddy

Prasanna Kumar Reddy: డబ్బుందని ఒక పెద్ద కోటేశ్వరుడిని నెల్లూరు లోక్‌సభకు, కోటేశ్వరురాలిని కోవూరు అసెంబ్లీకి నిలబెట్టారని వైసీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్నకుమార్‌ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఎవరూ భయపడే వాళ్ళు లేరన్నారు. చాలామంది కోటీశ్వరులు నియోజకవర్గం నుంచి పోటీ చేశారని.. ప్రజలందరూ డబ్బుకు ఆశ పడలేదు.. మా కుటుంబాన్ని ఆశీర్వదించారని ప్రసన్నకుమార్‌ రెడ్డి వెల్లడించారు. మిమ్మల్నే నమ్ముకున్నానని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

Read Also: Vijayasai Reddy: వాలంటరీ, సచివాలయ వ్యవస్థలను కూల్చడమే చంద్రబాబు ఉద్దేశం

పేద ప్రజలే తనకు, విజయ సాయి రెడ్డికి అండ అని పేర్కొన్నారు. ఎంతమంది వెళ్లిపోయినా మనకి నష్టం లేదన్నారు. డబ్బులకు ఆశపడి పలువురు వైసీపీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అమ్ముడుపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ గెలవబోయేది తానేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ మళ్లీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని.. పార్లమెంటు స్థానంలో విజయసాయిరెడ్డి గెలవబోతున్నారని ప్రసన్నకుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.

Show comments