NTV Telugu Site icon

Balineni Srinivasa Reddy: గన్‌మెన్‌లను సరెండర్ చేసిన మాజీమంత్రి బాలినేని.. డీజీపీకి లేఖ

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy: ఒంగోలు పోలీసుల తీరుపై మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు.. ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో పోలీసుల వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్న బాలినేని.. పోలీసుల తీరుకు నిరసనగా తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేశారు.. ఈ మేరకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. కేసులో వైసీపీ నేతలు ఉన్నా వదిలిపెట్టవద్దని ఇప్పటికే పలుమార్లు అధికారులను కోరిన బాలినేని.. అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు..

Read Also: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!

అయితే, కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారు పోలీసులు.. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దని మూడు రోజుల క్రితం కలెక్టర్‌ సమక్షంలో ఎస్పీని కోరారు బాలినేని.. పోలీసులు తన సూచనలను పట్టించుకోక పోవటంతో గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. కాగా, ప్రకాశం జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల కేసులో పోలీసుల వ్యవహారశైలిని తప్పుబట్టారు బాలినేని.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని.. నాలుగేళ్ల నుంచే ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నాను అంటూ ఆవేదన వెలిబుచ్చారు.. పోలీసులు తన సూచనను పెడచెవిన పెడుతున్నారని.. అందుకే తన గన్‌మెన్‌లను తక్షణం సరెండర్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు బాలినేని.. అయితే.. మాజీ మంత్రి, అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్యే ఇప్పుడు తన గన్‌మెన్‌లను సరెండర్ చేస్తూ లేఖ రాయడం జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోంది.