NTV Telugu Site icon

Murugudu Lavanya: అందరి సపోర్ట్ నాకే.. నారా లోకేష్ పై గెలుస్తా..!

Murugudu Lavanya

Murugudu Lavanya

Murugudu Lavanya: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.. వారి వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకు సాగుతున్నాయి.. మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులు తెలాల్సి ఉన్నా.. చాలా దాదాపు సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థులు ఎవరు? ఎవరికి ఎవరు పోటీ అనేది తేలిపోయింది.. ఇక, మంగళగిరిలో టీడీపీ నుంచి నారా లోకేష్‌ పోటీ చేస్తుండగా.. అతడికి చెక్‌ పెట్టడంతో పాటు సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడు కోవడంపై ఫోకస్‌ పెట్టింది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అయితే, అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కేను మార్చేసి.. ఓ మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపింది.. ఆమె.. మురుగుడు లావణ్య.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది నేను అనే ధీమా వ్యక్తం చేస్తున్న ఆమె.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు..

Read Also: అండర్19 ప్రపంచకప్ కలిసి ఆడారు.. 100 టెస్ట్ మ్యాచ్‌ కలిసే ఆడారు! మధ్యలో మరెన్నో

తన ప్రత్యర్థి ఎవరు అనేది ఆలోచించను.. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తాను.. విజయం సాధిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మురుగుడు లావణ్య.. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి, అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు.. అన్ని వర్గాల నుంచి మంచి సపోర్ట్‌ వస్తుంది.. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం నాదే అన్నారు. అంతేకాదు.. నేను లోకల్‌ అభ్యర్థిని.. నా ప్రధాన ప్రత్యర్థి నాన్‌ లోకల్‌ అని పేర్కొన్న ఆమె.. అందరికీ అందుబాటులో ఉంటాను.. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాను అన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పూర్తిస్థాయిలో నాకు మద్దతుగా పనిచేస్తున్నారు.. ఇక, నా ఫ్యామిలీ కూడా నాకు అండగా ఉంది.. నారా లోకేష్‌పై విజయం నాదే అంటున్న మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..

Show comments