NTV Telugu Site icon

YSRCP: రాజ్‌భవన్‌కు వైసీపీ నేతల బృందం.. పోలింగ్‌ తర్వాత హింసపై ఫిర్యాదు..

Ysrcp

Ysrcp

YSRCP: విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల బృందం.. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది.. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.. వైసీపీ నేతలు, మంత్రులు.. ఈ బృందంలో మంత్రి బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ , కావటి మనోహర్ నాయుడు తదితరులున్నారు.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తర్వాత చోటు చేసుకున్న అల్లర్లు, దాడులు వెనుక ఉన్న బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్ ను కోరారు వైసీపీ నేతలు.

Read Also: RAJASTHAN: మూడేళ్ల పాపను కారులో మరిచి వెళ్లిన తల్లిదండ్రులు.. చివరకు విషాదం మిగిలింది..

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోంది.. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశాం.. అబర్వర్ దీపక్ మిశ్రా పక్ష పతంగా వ్యవహరిస్తున్నారు.. టీడీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారు.. అబర్వర్ గా ఉన్న దీపక్ మిశ్రా పై న్యాయ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.. ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెచ్చుకుని దీపక్ మిశ్రాను మార్చాలని గవర్నర్‌ను కోరినట్టు వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Read Also: Police Fine: ఆ దెబ్బకు ఆడీ కారులో హెల్మెట్ పెట్టుకుని ప్రయాణిస్తున్న వ్యక్తి.. మ్యాటరేంటంటే..

ఇక, పల్నాడు ఎస్పీ, ఐజీ త్రిపాఠి వంటి కొందరు అధికారులు ఎన్నికల వేల పచ్చ చొక్కాలు వేసుకున్నారు అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి మేరుగ నాగార్జున.. రాయలసీమ, పల్నాడులో పోలీసులను మార్చాలని కోరాం.. కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో దీపక్ మిశ్రాను మార్చి దేశంలో ఏ అధికారి అయినా పర్లేదు అని గవర్నర్ ను కోరాం అన్నారు. మరోవైపు.. ఎంపీ మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ.. దీపక్ మిశ్రా వల్లే ఈ విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. పోలీసుల పక్షపాత ధోరణి వల్లే ఈ హింస జరుగుతోందన్నారు. దీపక్ మిశ్రా కనుసన్నల్లో పోలీసులు ఉన్న చోట ఈ హింస జరుగుతుందన్న ఆయన.. ప్రశాంతంగా ఉన్న ఏపీలో ఇలాంటి పరిస్థితులు రావటానికి కారణం దీపక్ మిశ్రా.. అతడిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామని పేర్కొన్నారు ఎంపీ మోపిదేవి వెంకట రమణ.