YSRCP: విజయవాడలో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన వైసీపీ నేతలు తిరుపతి మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, తిరుపతిలో ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతలు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు ప్రజలను భయపెట్టి, ప్రలోభాలు చూపించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఎన్నికల సమయంలో పోలీసులు నిర్వాకం వహిస్తున్నారని, టీడీపీ నాయకులు బహిరంగంగా దాడులకు పాల్పడుతుంటే.. పోలీసులేమీ చేయకుండా చోద్యం చూస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికలకు ప్రత్యేక అధికారి నియమించాలని ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు తెలిపారు.
Also Read: IOCL Recruitment 2025: 10th పాసైతే చాలు.. నెలకు రూ. 78 వేల జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రెడీ
వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. తిరుపతిలో టీడీపీ నేతలు తమ పార్టీ నాయకులపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వైసీపీ ప్రజాప్రతినిధులపై కిరాయి గూండాలు దాడులు చేశారని, ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. ఇటీవల తిరుపతిలో ప్రభుత్వ వైఫల్యాల కారణంగా మరణించిన ఘటన మరవక ముందే, ఇప్పుడు ఎన్నికల్లో అశాంతిని సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఎన్నికలను వాయిదా వేయాలని, భద్రతను మెరుగుపరిచేందుకు డీజీపీని ఆదేశించాలని కోరారు. పోలీసులు ముందుగా సమాచారం ఇచ్చినా కూడా ఎన్నికల హింసను అరికట్టలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, న్యాయమైన ఎన్నికలు జరగాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.