NTV Telugu Site icon

Janasena Party: వైసీపీకి షాక్‌..! పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరిన కీలక నేతలు

Janasena

Janasena

Janasena Party: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది.. ఈ మధ్య కొందరు జనసేన పార్టీకి చెందిన నేతలు.. జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకునే పనికి శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తోంది.. ఈ రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ సమక్షంలో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు నాలుగు జిల్లాలకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు.. పార్టీ కార్యాలయంలో జనసేన కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు పవన్‌ కల్యాణ్‌..

Read Also: 800 The Movie: సైలెంటుగా ఓటీటీలోకి వచ్చేసిన ముత్తయ్య 800.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?

ఇక, ఆ రోజు జనసేన పార్టీలో చేరిన నేతల విషయానికి వస్తే.. చిలకలపూడి పాపారావు సర్పంచ్‌, ఆంధ్రప్రదేశ్ సర్పంచ్‌ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కృష్ణాజిల్లా వైసీపీ నేత.. చిక్కాల దొరబాబు- తూర్పుగోదావరి వైసీపీ నాయకులు, దుగ్గన నాగరాజు- తూర్పుగోదావరి వైసీపీ నాయకులు, కలగ పాల్ పురుషోత్తం – తూర్పుగోదావరి వైసీపీ నాయకులు, ఎదురువాక వెంకటగిరి- తూర్పుగోదావరి వైసీపీ నాయకులు, పొగిరి సురేష్ బాబు – శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకులు, వై శ్రీనివాస్ రాజు – కడప జిల్లా వైసీపీ నాయకులతో పాటు.. మరికొందరు నేతలు కూడా ఉన్నట్టుగా జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు.

Show comments