Syamala: నాకు మనవడు కావాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి తన మనసులో కోరిక బయటపెట్టారు.. ఇంట్లో నా గ్రాండ్ డాటర్స్ అందరితో ఉంటే ఒక లేడీ హాస్టల్ లాగా ఉంటుంది.. వాళ్లకు నేను ఒక వార్డెన్ లాగా అనిపిస్తానన్న చిరు.. అలాగే ఈ సారైనా చరణ్ ని మగపిల్లాడిని కనమని చెప్పినట్టు, లెగసి కంటిన్యూ అవ్వాలని కోరిక అని చెప్పుకొచ్చారు.. ఇదే సమయంలో మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమో భయం అని వ్యాఖ్యానించారు చిరంజీవి.. అయితే, మెగాస్టార్ చిరంజీవి వారసుడు కావాలన్న వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల.. వారసుడు కొడుకే అవుతాడా..? కూతుర్లు కారా? అని ప్రశ్నించారు.. మెగాస్టార్ చిరంజీవి ఏ ఉద్దేశ్యంతో అన్నారో తనకు తెలియదన్నారు. వారసుడు అనేవాళ్లు కొడుకు అనే ఉద్దేశ్యంలో నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుందన్నారు.. మహిళలు అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నారని.. ఉపాసన అన్నీ వ్యాపారాలు చక్కగా నడుతున్నారన్నారు.. వారసులు అంటే ఒక్క కొడుకే కానక్కరలేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు శ్యామల..
Read Also: Moinabad Farm House: ఫామ్‌హౌస్‌లో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ.. 64 మంది అరెస్ట్!
ఇక, ఒక్కరి వ్యాఖ్యల వల్ల సినిమా పరిశ్రమ దెబ్బతినకూడదన్నారు శ్యామల.. చిరంజీవి వ్యాఖ్యల వల్ల కొందరికి కోపం వచ్చిందని.. సినిమా చూడం అంటున్నారని.. దానివల్ల నిర్మాతకు నష్టం కదా? అని ప్రశ్నించారు.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ కరువైందన్నారు.. విద్యార్ధులకు ఇచ్చే పథకాలు ఆపేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. గతంలో మద్యంపై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదని.. ఇప్పుడు ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారన్నారు. ఏపీ అభివృద్ధి జగన్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు శ్యామల.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు..