Pothina Mahesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేక పోతిన మహేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ మార్పు కోసం వచ్చాడని అందరం భావించాం.. కానీ ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుకు ఊడిగం చెయ్యటానికి వచ్చాడని ఈ మధ్యే అర్థం అయిందని ఆయన చెప్పారు. సాధారణ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నానని 2014లో పవన్ చెప్పారని.. ఒకప్పుడు కారు ఈఎంఐ కట్టలేనని చెప్పాడని ఆయన అన్నారు. కానీ 2024 నాటికి 1500 నుంచి 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయన్నారు. తిరగటానికి సొంతంగా హెలికాప్టర్, భూములు ఎలా వచ్చాయో పవన్ చెప్పాలని పోతిన మహేష్ ప్రశ్నించారు.
Read Also: Flight Fighting: సీటు కోసం విమానంలో కొట్లాట.. వీడియో వైరల్
నమ్ముకున్న నాలాంటి వాళ్ళని అమ్ముకుని పవన్ ఆస్తులు సంపాదించాడని ఆరోపించారు. మార్పు కోసం పని చెయ్యాలి అని చెప్తూ పవన్ చంద్రబాబుకు పాలేరులా పని చేశారన్నారు. ప్రజారాజ్యం పార్టీని నడపలేక చిరంజీవి ఎత్తేస్తే.. పవన్ పార్టీ పెట్టడానికి డబ్బులు తీసుకున్నాడని ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు ముందే గ్రహించి తీర్పు ఇచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీవ్వను అంటు బాబుకే ఊడిగం చేస్తూ కొత్త పల్లవి ఎత్తాడన్నారు. తీసుకుంటున్న సీట్లు ఎన్ని.. మార్పు సాధ్యం ఎలా.. పార్టీ పెట్టిందే పవన్ ఆస్తులు సంపాదించటానికి అంటూ పోతిన మహేష్ ఎద్దేవా చేశారు.మాలాంటి వాళ్ళని తాకట్టు పెట్టి లగ్జరీ కార్లు కొన్నాడని ఆరోపించారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కనే 100 కోట్ల ల్యాండ్ కొన్నాడని ఆయన అన్నారు. ఈ ల్యాండ్ కొనటానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. సినిమాలు కూడా తియ్యలేదన్నారు. ఈ అంశంపై సీఐడీకి, సీబీఐకి ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Read Also: Election Commission: డీబీటీ పథకాల అమలు.. సీఎస్‌కు ఈసీ కీలక ఆదేశాలు..
ఎన్నారైలు, కాపు సామాజిక వర్గం ఇచ్చిన డబ్బులు పవన్ వాడుకున్నాడని విమర్శించారు. పవన్ రక్త సంబంధీకుల ఆస్తుల వివరాలు వెల్లడించాలని.. చిరంజీవి , రామ్‌చరణ్ తప్ప అందరి ఆస్తుల వివరాలు చెప్పాలన్నారు. పవన్ కుటుంబ సభ్యులే ఆయనకు బినామీలు అంటూ ఆరోపణలు చేశారు. 28 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయన్నారు. 48 కోట్లు అప్పులు ఉన్నాయని అని ఎన్నికల అఫిడవిట్‌లో పవన్ కల్యాణ్ పెట్టాడని.. కానీ చాలా ఆస్తులు పవన్ కొన్నాడన్నారు. హైదరాబాద్‌లో జనసేన పార్టీ కార్యాలయం ఒకప్పుడు అద్దె భవనమని, ఇప్పుడు సొంత భవనం అని.. ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదన్నారు. ఎన్నికలు అయ్యాక సినిమా డబ్బుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చూపిస్తాడని అన్నారు. పవన్ కళ్యాణ్ పై చాలా ఆస్తులు ఉన్నాయని.. వీటికి డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. పవన్ తీసిన సినిమాలు ఎన్ని వచ్చిన ఆదాయం ఎంత అని అడిగారు. 2 వేల కోట్ల ఆస్తులు ఉన్న పవన్ సామాన్య మధ్య తరగతికి చెందిన వాడు ఎలా అవుతాడన్నారు.
