NTV Telugu Site icon

Jupudi Prabhakar Rao: పేదవాడికి చట్ట సభల్లోకి వచ్చే అర్హత లేదా చంద్రబాబు?

Jupudi Prabhakar Rao

Jupudi Prabhakar Rao

Jupudi Prabhakar Rao: టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర రావు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆలోచనలకు చంద్రబాబు నాయుడు భిన్నం అని, పెత్తందారీ ప్రయోజనాల కోసం పని చేసే కిరాయి వ్యక్తి పేదవర్గాలంతా కూలోళ్లుగానే బతకాలన్నది చంద్రబాబు అహంకారమని, ఎస్పీలు, బీసీల్నీ పదే పదే అవమానించి, టిప్పర్‌ డ్రైవర్లకు వైఎస్సార్‌సీపీ సీట్లు ఇస్తోందా అని వ్యాఖ్యానించిన అహంకారి బాబును క్షమించే ప్రసక్తే లేదన్నారు. సింగనమలలో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు పోటీ చేస్తున్నారని చంద్రబాబు అవమానించారన్నారు.

Read Also: YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

చంద్రబాబు పెత్తందారి లాగా మాట్లాడారని.. ఆయనకు పిచ్చి పట్టిందో… మెంటల్ ఎక్కింది మాకు తెలియదన్నారు. బీజేపీ అభ్యర్థిని పక్కన పెట్టుకుని ఓటు వేయవద్దని చంద్రబాబు అంటారని.. పేదవాడికి చట్ట సభల్లోకి వచ్చే అర్హత లేదా చంద్రబాబు అంటూ ఆయన ప్రశ్నించారు. లోకేష్‌ను దొడ్డి దారిలో చట్టసభలోకి చంద్రబాబు తీసుకువచ్చారని విమర్శించారు. బహిరంగ సభల్లో కులాలను చంద్రబాబు అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు తిరగబడాలన్నారు. నెల్లూరు గూడూరులో ఒక వైశ్య సామాజిక వర్గంకు చెందిన వ్యక్తి ఎస్సీనీ పెళ్లి చేసుకుంటే ఆమెకి టీడీపీ టికెట్ ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు.