Site icon NTV Telugu

Devineni Avinash: 18 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది..? వైసీపీ నాయకుడు ఘాటు వ్యాఖ్యలు..!

Devineni Avinash

Devineni Avinash

Devineni Avinash: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైస్సార్సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తమ వ్యతిరేకతను ఈ సంతకాల ద్వారా తెలియజేస్తున్నారని ఆయన అన్నారు. విజయవాడలోని తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్‌లో సంతకాల సేకరణ చేపట్టామని, ఇప్పటికే 96 వేలకు పైగా సంతకాలు సేకరించామని అవినాష్ వెల్లడించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కూడా 60 వేలకు పైనే సంతకాలు సేకరించినట్లు ఆయన తెలిపారు. ఈ సేకరించిన సంతకాలను నియోజకవర్గాల నుండి జిల్లా పార్టీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి, డిసెంబర్ 15వ తేదీన జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్దకు పంపుతామని అవినాష్ ప్రకటించారు.

Tata Nexon: మారుతి , మహీంద్రా కంపెనీల కార్లను అధిగమించించిన నెక్సాన్

ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన అన్ని సంతకాలను డిసెంబర్ 17వ తేదీన గవర్నర్‌కు అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు దేవినేని అవినాష్ కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. గత 18 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే సంక్షేమం లేదా అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా చేపట్టలేదని.. తమ ప్రభుత్వ హయాంలోనే సంక్షేమం, అభివృద్ధి పనులు సాగాయని గుర్తు చేశారు. అలాగే ఈ నెల 8వ తేదీ దాటినా కూడా ఉద్యోగులకు జీతాలు పడలేదని, తమ పాలనలో ఒక్కరోజు ఆలస్యమైనా రభస చేసే ఎల్లో మీడియాకు ఇప్పుడు ఈ విషయం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పథకాలకు పేర్లు మార్చినప్పటికీ, వాటిని కూడా సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు ఏమైపోతున్నాయో తెలియడం లేదని, రాష్ట్రంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Toxic : కౌంట్‌డౌన్ మొదలు పెట్టిన గ్యాంగ్‌స్టర్ ‘టాక్సిక్’.. రిలీజ్ డేట్ ఫిక్స్

Exit mobile version