YSRCP: పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీపై వైసీపీ ఫోకస్ చేసింది. ఇప్పటికే పార్టీ యువ, మహిళా విభాగం కార్యవర్గాన్ని పార్టీ ప్రకటించింది. ఇవాళ మరో ఆరు విభాగాల కార్యవర్గాల ప్రకటన చేసింది వైసీపీ. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా కృష్ణ మూర్తి నియామకమయ్యారు. ఉపాధ్యక్షులుగా డోలా జగన్, కాండ్రు కమల, బి.హరిప్రసాద్‌ను నియమించారు. 39 మందితో కార్యవర్గం ఏర్పాటైంది. క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఎం జాన్సన్ నియమితులు కాగా.. ముగ్గురు ఉపాధ్యక్షులతో సహా 42 మందితో కార్యవర్గం ఏర్పాటైంది.
Read Also: AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఖాదర్ బాషా నియామకం కాగా.. ఉపాధ్యక్షులుగా ఫారుక్, హంజా హుసైనిలతో పాటు మరో 38 మంది సభ్యులతో మైనారిటీ కార్యవర్గం ఏర్పాటైంది. రైతు విభాగం అధ్యక్షుడిగా ఎం.వి.ఎస్. నాగిరెడ్డి కాగా.. ముగ్గురు ఉపాధ్యక్షులు సహా 34 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు. పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులుగా కుప్పం ప్రసాద్, పల్లపోతు మురళీకృష్ణ నియమితులు కాగా.. 74 మందితో కార్యవర్గం ఏర్పాటైంది.
Read Also: Putin: అప్పుడే శాంతి నెలకొంటుంది.. ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్ వ్యాఖ్యలు..
చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గంజి చిరంజీవిని నియమించారు. ముగ్గురు ఉపాధ్యక్షులు సహా 54 మందితో కార్యవర్గం ఏర్పాటైంది. ఇటీవల గంజి చిరంజీవికి మంగళగిరి నియోజకవర్గం ఇంఛార్జి బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇక చేనేత విభాగం ఉపాధ్యక్షులుగా నిమ్మన లీలారాణి, చందన నాగగౌరీశంకరకోటిలింగం, జింకా విజయలక్ష్మిలను నియమించారు.
