NTV Telugu Site icon

SV Mohan Reddy: పప్పులు, బెల్లంలా దేవాలయాల భూములను పంచుకుంటే ఊరుకోం.. మాజీ ఎమ్మెల్యే సీరియస్..!

Sv Mohan Reddy

Sv Mohan Reddy

SV Mohan Reddy: దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న చీకటి జీవోపై వైఎస్సార్సీపీ తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయ భూములను కొల్లగొట్టే కుట్రకు కూటమి ప్రభుత్వం తెరదీసింది. ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం అని అన్నారు.

Read Also: Raghunandan Rao: యుద్ధం చేసేటోనికి తెలుస్తుంది.. సీఎంపై బీజేపీ ఎంపీ ఫైర్..!

ప్రభుత్వానికి ఎండోమెంట్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే హక్కు లేదని స్పష్టం చేశారు. పప్పులు, బెల్లంలా దేవాలయల భూములను పంచుకుంటే చూస్తూ ఊరుకోం. దేవుడి భూములను వాణిజ్యమయం చేయాలన్న కుట్రను ప్రజలు ఒప్పుకోరని మండిపడ్డారు.

Read Also: Ravindranath Reddy: సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కటైన అమలు చేశారా..? అన్ని కట్టు కథలే..!

ఈ విషయమై కూటమి భాగస్వామ్యమైన బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా వ్యతిరేకించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దేవుడి భూములను కోసుకునే కుట్రలు చేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తున్నాం న్యాయపోరాటం చేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు.