YSRCP: 4 కీలక కార్యక్రమాలు ప్రకటించిన వైసీపీ
YSRCP: విజయవాడ వేదికగా జరుగుతోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సభలో నాలుగు కీలక కార్యక్రమాలను ప్రకటించింది ఆ పార్టీ.. జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్రా పేరుతో నాలుగు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు.. ప్రతి సచివాలయ పరిధిలోని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల దగ్గరకు వెళ్లేవిధంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది వైసీపీ.. మొదటి దశలో సచివాలయ పరిధిలోని లబ్దిదారుల జాబితా ప్రదర్శించనున్నారు.. రెండో దశలో పార్టీ జెండాల ఆవిష్కరణ.. మూడో దశలో ఇంటింటి సందర్శన.. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల పని తీరును పోలిస్తూ వివరించడం చేయనున్నారు.. నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు..
Read Also: IPO Listing: ఓయో నుంచి టాటా వరకు ఐపీవోకు 28 కంపెనీలు.. రూ. 38000 కోట్లు సమీకరించే ప్లాన్
Also Read
- Malkajgiri: డేటింగ్ యాప్‌లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్‌తో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ముంచిన యువతి
- Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
- Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్‌గా..
- Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు లేఖ..
ఇక, బస్సు యాత్ర కూడా చేపట్టబోతున్నారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చేసిన అభివృద్ధి పనులను వెల్లడించడానికి బస్సు యాత్రను ఉపయోగించుకోనున్నారు.. మూడు నెలల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగించనున్నారు. మరోవైపు.. ఆడుదాం ఆంధ్రా పేరుతో.. సచివాలయ, మండల, జిల్లా స్థాయిల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తారు.. జనవరి 17వ తేదీ వరకు ఆడుదాం ఆంధ్రా కింద క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఇక, నాలుగున్నర ఏళ్లుగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం ఉండనుంది. సీఎం జగన్ స్వయంగా సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.. 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా పార్టీ ప్రతినిధుల సభలో దిశా నిర్దేశం చేస్తున్నారు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
-
Malkajgiri: డేటింగ్ యాప్‌లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్‌తో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ముంచిన యువతి
-
Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
-
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్‌గా..
-
Today Gold and Silver Prices: బంగారం ధరల మంటలు.. నేడు మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో