CM Jagan : ఏపీలో నేతన్నలకు శుభవార్త.. నేడు నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ. 24,000 ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది నేడు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ.193.64 కోట్లను నేడు తిరుపతి జిల్లా వెంకటగిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. శుక్రవారం రోజు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్.. విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్న ఆయన.. ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.. అనంతరం వైఎస్సార్ నేతన్ననేస్తం పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం సొమ్ము డిపాజిట్ చేస్తారు.
Also Read : Lakshmi stotram: భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ పంట పండినట్లే..!
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
అనంతరం వెంకటగిరి త్రిభువన్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం వైఎస్ జగన్.. రేపు వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులు జమ కానుండగా.. ఏటా వైఎస్సార్ నేతన్న నేస్తం కింద సాయాన్ని అందిస్తూ వస్తోంది వైఎస్ జగన్ సర్కార్.. చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24,000 ఆర్థిక సాయం చేస్తున్నారు.. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేత కార్మికులకు లబ్ధి పొందనున్నారు.. రూ.193.64 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కాగా, రాష్ట్రవ్యాప్తంగా చేనేతల కోసం వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం తీసుకొచ్చింది జగన్ సర్కార్. అర్హత కలిగి సొంత మగ్గం ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24,000 చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ .1.2 లక్షలు సాయం అందుతోంది. ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.. తప్పనిసరిగా వృత్తిపరంగా చేనేతగా ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి కచ్చితంగా చేనేత సంఘంలో నమోదు చేసుకోని ఉండాలనే నిబంధన ఉన్న విషయం తెలిసిందే.
Also Read : Virat Kohli Unique Record: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!