NTV Telugu Site icon

Andhrapradesh: జగన్‌ సర్కార్ గుడ్‌న్యూస్.. నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నగదు జమ

Ysr Kalyanamastu

Ysr Kalyanamastu

Andhrapradesh: ఏపీ ప్రభుత్వం కొత్తగా పెళ్లి చేసుకున్నవారికి ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయింది. పేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాల కింద శుక్రవారం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నగదు జమ చేయనున్నారు. ఈ మేరకు జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద రూ. 87.32 కోట్ల ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా లబ్దిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ నగదును జమ చేయనున్నారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ పథకాల కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు జరిగినట్లవుతుంది. వీరి ఖాతాల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.125.50 కోట్లు జమ చేసింది.

పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్‌ షాదీ తోఫా ద్వారా ఆర్ధిక సాయం అందిస్తుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గడిచిన ఆరు నెలల్లోనే వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద 16,668 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 125.50 కోట్లు జమ చేసింది జగన్ ప్రభుత్వం. ‘పిల్లల చదువు ఇంటికి వెలుగు– ఇల్లాలి చదువు వంశానికే వెలుగు’ అనే మాటను స్ఫూర్తిగా తీసుకుని దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓవైపు పేద కుటుంబాల్లోని చెల్లెమ్మల పెళ్లిళ్లకు అండగా నిలుస్తోంది. మరోవైపు ప్రతి చెల్లెమ్మను, ప్రతి తమ్ముడిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం, బాల్యవివాహాలను నివా­రిం­చడం, పేద కుటుంబాలకు చెందిన వధువుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోవడం వంటి సమున్నత లక్ష్యాలతో ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోంది.

Read Also: Karnataka Elections 2023: ఓట్లకు ఇంకా వారం టైం ఉంది.. కానీ ముందే ఓటేసిన తాత

కేవలం వందకు వంద శాతం అక్షరాస్యతే మన లక్ష్యంగా కాకుండా వందకు వంద శాతం గ్రాడ్యుయేట్‌లుగా పిల్లలను తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫాలకు ప్రభుత్వం 10వ తరగతి ఉత్తీర్ణత, వధువుకు కనీస వయోపరిమితి 18 ఏళ్ళుగా, వరునికి 21 ఏళ్ళుగా నిర్ధేశించింది. చిన్నారులు పదో తరగతికి వచ్చే సరికి వారికి 15 ఏళ్ళ వయసు వస్తుంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 1వ తరగతి నుండి ఇప్పటికే ఏటా అందిస్తున్న రూ. 15,000ల జగనన్న అమ్మ ఒడి సాయం ఇంటర్‌ వరకు కూడా ఇస్తుండడంతో విద్యార్థినుల ఇంటర్‌ చదువులు కూడా సాకారమవుతున్నాయి.