Site icon NTV Telugu

YSR Health University: వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ నేమ్ బోర్డును ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు..

Ntr

Ntr

YSR Health University: విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును అర్ధాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మార్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఎన్టీఆర్ వ‌ర్సిటీ పేరు మార్పుపై టీడీపీ స‌భ్యులు ఉభ‌య‌స‌భ‌ల్లో ఆందోళ‌న నిర్వ‌హించారు. అసెంబ్లీలో స్పీకర్‌, మండలిలో పోడియం వద్దకు దూసుకొచ్చిన సభ్యులు ప్లక్లార్డులతో నిరసన కూడా తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అప్పట్లో ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళలనాలను కూడా చేశారు.

Manipur: మణిపూర్లో రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం..

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును.. ఉన్నపలంగా ‘వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ’గా మార్చడం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వైస్సార్సీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టిన సంగతి గుర్తు ఉంది ఉంటుంది. ఇక అప్పట్లో జగన్ తుగ్లక్‌ చర్యలను అవలంభిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎన్టీఆర్‌ తెలుగు వారి ఆత్మగౌరవమని పేర్కొంటూ.. ఎన్టీఆర్‌ పేరు తొలగించాలని ఎలా అనిపిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇక అప్పట్లో తాము అధికారంలోకి రాగానే హెల్త్ యూనివర్శిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

KK Survey: కిక్కెకించిన ‘కేకే’ సర్వే.. కూటమి సునామీని బాగానే అంచనా వేసాడుగా..

ఈ నేపథ్యంలో తాజగా వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ నేమ్ బోర్డును తెలుగుదేశం కార్యకర్తలు ధ్వంసం చేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version