NTV Telugu Site icon

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నన్ను విశ్వసించినందుకు కృతజ్ఞతలు..

Sharmila Tweet

Sharmila Tweet

ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా తనను విశ్వసించినందుకు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కె.సి.వేణుగోపాల్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు వైఎస్ షర్మిల ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం అందించేలా.. పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో నమ్మకంగా పని చేస్తానని హామీ ఇస్తున్నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాణిక్కం ఠాకూర్ కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని అన్నారు.

Rahul Gandhi: రామమందిర ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి కాంగ్రెస్ ఎందుకు వెళ్లదో చెప్పిన రాహుల్ గాంధీ..

ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడితో సన్నిహితంగా పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని షర్మిల తెలిపారు. తాను.. మాజీ పీసీసీ చీఫ్ తగిడుగు రుద్రరాజు, రాష్ట్ర పార్టీలోని ప్రతీ నాయకుడి మద్దతును కూడా కోరుతున్నానని అన్నారు. వారందరి సహకారంతో అనుభవం, నైపుణ్యంతో మా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలనుకుంటున్నానని.. షర్మిల ట్వీ్ట్ చేశారు.

Honeymoon: “హనీమూన్” ఆలస్యం కావడంతోనే పైలెట్‌పై దాడి.. ఇండిగో ఘటనలో కీలక అంశాలు..

కాగా.. కాసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ తీర్మానాన్ని విడుదల చేసింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్‌ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. వైఎస్ షర్మిల.. జనవరి 4న కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో, వైఎస్ షర్మిల జాయిన్ అయ్యారు. అనంతరం సోనియా గాంధీతో కూడా షర్మిల మాట్లాడారు.