ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు. నా కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని తెలిపారు. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెడతారని తెలిపింది. నేడు తల్లితోపాటు కర్నూలు ఉల్లి మార్కెట్ పర్యటనలో పాల్గొన్నారు రాజారెడ్డి. ఉల్లి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. షర్మిల ఆశీర్వాదం తీసుకొని అమెతోపాటు కర్నూలు పర్యటనకు వెళ్లారు. వైఎస్ రాజారెడ్డి ఇంటి వద్ద నానమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు. చదువు పూర్తి కాగానే చట్నీస్ వ్యవస్థాపకుడు ప్రసాద్ అట్లూరి మనవరాలు ప్రియాని గతేడాది వివాహం చేసుకున్నాడు.
Also Read:CM Revanth Reddy: మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికితను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
కాగా ఇటీవల వైఎస్ రాజశేఖర్రెడ్డి 16వ వర్థంతి సందర్భంగా పులివెందులలో ఆయనకు ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. షర్మిల తండ్రికి నివాళులు అర్పించారు. ఆ సమయంలో షర్మిల వద్ద రాజారెడ్డి కూర్చున్నాడు. అప్పటి నుంచి రాజారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా వైఎస్ షర్మిల తన కొడుకు రాజకీయాల్లోకి వస్తాడంటూ ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.