హైదరాబాద్‌లో నేడు వైఎస్సార్‌టీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాల్గొని మాట్లాడుతూ.. పాలేరు నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ఇంకో స్థానం నుంచి కూడా పోటీ చేస్తాని ఆమె పేర్కొన్నారు. విజయమ్మ, అనిల్ కూడా పోటీ చేయాలని డిమాండ్ ఉందని, అవసరం అయితే విజయమ్మ పోటీ చేస్తారని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టి రెండు సంవత్సరాలు అవుతుందని, గొప్ప చరిత్ర లేకపోవచ్చు.. ప్రజల కోసం పోరాటాలు చేశానన్నారు వైఎస్ షర్మిల. మొట్టమొదట నిరుద్యోగుల కోసం YSRTP దీక్షలు చేసిందని, ప్రతిపక్షానికి సోయి వచ్చింది.. పాలక పక్షానికి బుద్ది వచ్చిందన్నారు వైఎస్ షర్మిల. మధ్యమధ్యలో కార్లు ఎక్కకుండా పాదయాత్ర చేశానని, ఎవరికి బెదరకుండా… అదరకుండా పోరాటం చేశానన్నారు వైఎస్ షర్మిల.
Also Read : China: పిల్లల్ని కనడం మానేసిన చైనా ప్రజలు.. రికార్డ్ స్థాయిలో తగ్గిన జననాలు..
అంతేకాకుండా.. కాంగ్రెస్ తో వెళ్తే వ్యతిరేక ఓటు చీలదు.. బీఆర్‌ఎస్‌కు లాభం జరగవద్దని అనుకున్నామని, నాలుగు నెలల పాటు నిరీక్షించామన్నారు. తెలంగాణ ప్రజల కోసం త్యాగానికి సిద్దం అయ్యాని వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పుడు మనకు మంచే జరిగిందని, 119 నియోజకవర్గాల్లో YSRTP పోటీ చేస్తుందన్నారు. ఈ రోజు నుంచి 119 నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఇవ్వలనుకునే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆమె వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చమనే అపవాదు రాకుండా త్యాగానికి సిద్దం అయ్యాన్నారు షర్మిల.
Also Read : Samantha : మరోసారి హాస్పిటల్‌లో చేరిన సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్…