YS Sharmila : వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసుల దాడి కేసులో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మే 8వ తేదీ వరకు ఆమెకు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. సిట్ కార్యాలయం ముట్టడి అనంతరం ‘టీ సేవ్’ నిరాహార దీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి మద్దతు కోరాలని షర్మిల నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం షర్మిల ఇంటి నుంచి బయలుదేరుతుండగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసినందుకు షర్మిలను అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా వైఎస్ షర్మిల, ఏ2గా కారు డ్రైవర్ బాలు, ఏ3గా మరో డ్రైవర్ జాకబ్ పేర్లను చేర్చారు.
Also Read : CM KCR : కృష్ణా, గోదావరి ఉన్నప్పటికీ నీటి కష్టాలా..?
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
వైఎస్ షర్మిలని అరెస్ట్ చేసిన పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు 24 గంటలూ పని చేస్తారని, అలాంటి వారిపై చేయి చేసుకోవడం వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని అన్నారు. షర్మిల తన కారు డ్రైవర్‌ను వేగంగా వెళ్లమని చెప్పిందని, ఈ క్రమంలో ఓ పోలీసు కానిస్టేబుల్ కాలికి గాయమైందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సైతో పాటు మరో మహిళా కానిస్టేబుల్‌పై షర్మిల దురుసుగా ప్రవర్తించినట్లు కోర్టుకు వివరించారు.
Also Read : Neha Sharma: రామ్ చరణ్ హీరోయిన్ కు జాకెట్ లో అందాలు దాగనట్టున్నాయే..
షర్మిల తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. షర్మిలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు షర్మిలను బయటకు వెళ్లనివ్వడం లేదని, పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. ఓ ఎస్సై తనను తాకేందుకు ప్రయత్నించారని షర్మిల కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘చాలా మంది పోలీసులు ఆమెను అడ్డుకుని చేయి విరగ్గొట్టేందుకు ప్రయత్నించారు. నన్ను కొట్టారు. ఈ క్రమంలో నేను వారిని తోసేశాను’ అని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తొలి తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అనంతరం 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది హైకోర్టు. కాగా… షర్మిల బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా… విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!