Site icon NTV Telugu

YS Jagan: వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు

Ys Jagan

Ys Jagan

YS Jagan: మాజీ ముఖ్యమంత్రి జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన ఇవాళ విజయవాడ నుంచి తిరుపతికి నేటి సాయంత్రం వెళ్లాల్సి ఉంది. గతంలో నేటి రాత్రి తిరుమలలో బస చేసి రేపు(శనివారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉద్రిక్తతల నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జగన్ తిరుమల టూర్ ప్రకటించినప్పటి నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది. డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అనవసర సమస్యలు రావొద్దనే ఆలోచనతో తిరుమల పర్యటనను జగన్ రద్దు చేసుకున్నట్లు తెలిసింది. మరికాసేపట్లో జగన్‌ మీడియా ముందుకు రానున్నారు.

Read Also: AP KGBV Recruitment 2024: కేజీబీవీల్లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. వివరాలు ఇలా.!

 

Exit mobile version