వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రెస్‌మీట్‌లో పాల్గొననున్నారు. కీలక ప్రెస్‌మీట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తాజాగా జరుగుతున్న పరిణామాలపై వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడనున్నారు.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరలు, అక్రమ అరెస్టులు, తన పర్యటనలపై ఆంక్షలు సహా తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. ప్రతీసారి మీడియా సమావేశానికి జగన్ లెక్కలతో సహా వస్తున్నారు. జగన్ లెక్కలకు కూటమి ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. జగన్ కీలక ప్రెస్‌మీట్ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
