YS Jagan: అక్టోబరు 10 నుంచి రచ్చబండ కార్యక్రమం.. కోటి సంతకాలను సేకరిస్తాం!
- అక్టోబరు 10 నుంచి రచ్చబండ కార్యక్రమం
- మెడికల్ కాలేజీల ప్రైవటీకరణపై కరపత్రాలు పంపిణీ
- రచ్చబండ కార్యక్రమాల ద్వారా కోటి సంతకాలను సేకరిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తాను అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. అక్టోబరు 10 నుంచి నవంబర్ 22వరకూ రచ్చబండ కార్యక్రమం ఉంటుందని, మెడికల్ కాలేజీల ప్రైవటీకరణపై కరపత్రాలు పంపిణీ చేస్తామని చెప్పారు. కోటి సంతకాలను రచ్చబండ కార్యక్రమాల ద్వారా సేకరిస్తామని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాలు సేకరిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయ కర్త ప్రతిరోజూ రెండు గ్రామాలను సందర్శిస్తాడని, అలాగే నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్స్ ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు ఉంటాయని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీలక విషయాలపై మాట్లాడారు.
‘అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు ఉంటాయి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి డిమాండ్ పత్రాలను సమర్పించాలి. జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ర్యాలీలు జరుగుతాయి. ఒక జిల్లాలో నేను కూడా పాల్గొంటాను. నవంబర్ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన సంతకాలు జిల్లా కేంద్రానికి చేరుకుంటాయి. నవంబర్ 24న సేకరించిన సంతకాలతో కూడిన వాహనాలను జిల్లా కేంద్రంలో జెండా ఊపి విజయవాడకు తరలిస్తారు. సేకరించిన ఈ సంతకాలు గవర్నర్ గారికి అప్పగించే కార్యక్రమం తదుపరి జరుగుతుంది’ అని వైఎస్ జగన్ తెలిపారు. ‘ప్రభుత్వ స్కూళ్లలో ఐదు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. మన హయాంలో నో వేకెన్సీ బోర్డులు చూశాం. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కడం ఇప్పుడు చూస్తున్నాం. మన హయాంలో ఐదేళ్లలో ఎప్పుడూ అలాంటివి లేవు. ఎరువుల పంపిణీలో కూడా స్కాం చేశారు. దళారీలతో చేతులు కలిపారు. ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. పేదలను ఇంకా అన్యాయం చేస్తున్నారు. వారిని మరింత పేదరికంలోని నెడుతున్నారు’ అని మాజీ సీఎం మండిపడ్డారు.
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Also Read: YS Jagan: ముఖ్యమంత్రికి పాలన మీద కాదు.. సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే ధ్యాస!
‘భవిష్యత్తులో కూడా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందనీయకుండా చేస్తున్నారు. మనం కొత్తగా పెట్టిన కాలేజీలను ఇప్పుడు తన బినామీలకు, మనుషులకు తెగనమ్ముతున్నాడు. మనం వచ్చేంత వరకూ రాష్ట్రంలో ఉన్నవి 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే. మనం ఒక విజన్ను ఆవిష్కరించాం. ప్రతి జిల్లాల్లో గవర్నమెంటు కాలేజీ ఉండాలన్న సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు పెట్టాం. ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు ఎందుకు నడుపుతుంది?. అలా చేయకపోతే ప్రైవేటు వాళ్లు ప్రజలను దోచుకుంటారు. ఇవి నడపకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయాన్ని ప్రజలకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి. మనం ఉన్నప్పుడే 2023-24లోనే కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మరో రెండు కాలేజీలు క్లాసులకు అందుబాటులోకి తెచ్చాం. తద్వారా 800 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పులివెందులోల 50 సీట్లు NMC ఇస్తే.. వద్దని చంద్రబాబు లెటర్ రాశాడు. మన హయాంలోనే అవసరమైన నిధులకు ఫైనాన్సియల్ టై అప్ చేశాం. అమరావతికి 50వేల ఎకరాలు సరిపోవని, మరో 50వేల ఎకరాలు సేకరిస్తున్నాడు. మొదటి 50 వేల ఎకరాలకే మౌలిక సదుపాయాలకోసం రూ.1లక్ష కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్లు అవుతుందని చెప్తున్నారు. అలాంటి లక్షల మందికి, కోట్ల మందికి వైద్యం అందించి, చిరస్థాయిగా నిలబడే ఆస్తులైన మెడికల్ కాలేజీలను అప్పనంగా అమ్మేస్తున్నారు?. ఐదేళ్లలో రూ.5వేల కోట్లు పెట్టలేరా?. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది’ అని నేతలను ఉద్దేశించి జగన్ అన్నారు.
తాజావార్తలు
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!