Site icon NTV Telugu

YS Jagan: ఒక్కొక్క ఓటరుకు ఒక్కొక్క రౌడీని పెట్టారు..

Ys Jagan1

Ys Jagan1

జడ్పీటీసీ ఉపఎన్నికలపై మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఓటర్లు వారి వారి ఊర్లలోనే ఓట్లు వేస్తూ వస్తున్నారు.. ఈ ఎన్నికలకు సంబంధించి బూత్ లు అటు ఇటు మార్చేసి కుట్రలకు తెరతీసిన చంద్రబాబు.. ఆరు పోలింగ్ బూత్ లు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి మార్చారు.. నల్లపురెడ్డిపల్లె వాళ్ళు ఎర్రబల్లి వచ్చి ఓట్లు వేయాలి.. ఎర్రబల్లి వాళ్ళు నల్లపురెడ్డిపల్లె వెళ్ళి ఓట్లు వేయాలి.. నల్లపురెడ్డిపల్లె వాళ్ళు నల్లగొండవారిపల్లె వెళ్ళి ఓట్లు వేయాలి.. నల్లగొండవారిపల్లె వాళ్ళు నల్లపురెడ్డిపల్లె వెళ్ళి ఓట్లు వేయాలి.. వెళ్ళే దారిలోనే ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయాలి.. దాడి చేసి అడ్డగించాలి.. నిన్న జరిగింది మొత్తం అదే..

Also Read:YS Jagan: ఇక ఎన్నికలు ఎందుకు.. గుద్దుకోవడమే

పులివెందుల ఆరు పంచాయతీలకు సంబంధించి 15 పోలింగ్ బూత్ లకు భద్రత పేరుతో 700 మంది పోలీసులను పెట్టారు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వాళ్ళు తెల్లవారుజామునే పాగా వేశారు.. ఒక్కో బూత్ కు 400 మందికి పైగా వచ్చారు.. ఒక్కొక్క ఓటరుకు ఒక్కొక్క రౌడీని పెట్టారు.. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని చెప్పగలరా.. మంత్రి సవిత ఆమె మనుషులు ఎర్రబల్లిలో తిష్టవేశారు.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన మనుషులతో తిష్ట వేశారు.. బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్ కాదు.. అయినా తిష్ట వేసి దౌర్జన్యం చేశారు.. పోలింగ్ బూత్ లకు వెళ్లిన వైసీపీ ఏజెంట్లను కొట్టి దాడిచేసి వాళ్ళ దగ్గరి నుంచి ఫార్మ్స్ లాక్కున్నారు.. ఎవరైనా బూత్ ల దగ్గరకు వచ్చినా.. వాళ్ళ దగ్గర ఓటర్ స్లిప్పులు లాక్కుని పంపివేశారని మండిపడ్డారు.

Also Read:Indo-Pak border: సరిహద్దులో పాక్ కవ్వింపులు.. జవాన్ వీరమరణం

బయటి వ్యక్తులు వచ్చి ఇక్కడకు వచ్చి దర్జాగా ఓట్లు వేయించుకుని వెళ్తుంటే కలెక్టర్ జేబులో చేతులు పెట్టుకుని కూర్చున్నారు.. మేం గుర్తించింది కొందరిని మాత్రమే.. ఇంకా చాలామంది ఉన్నారు.. యాక్టివ్ లేని వారు.. సైలెంట్ గా వచ్చి దొంగ ఓట్లు వేసుకుని వెళ్ళిపోయిన వారు ఉన్నారు.. పోలింగ్ బూత్ లల్లో వైసీపీ ఏజెంట్లు లేరు.. వాళ్ళ ఇష్టానుసారం రిగ్గింగుకు పాల్పడ్డారు.. మహిళా ఏజెంట్లపై కూడా దాడులకు పాల్పడ్డారు.. దాడులు మొత్తం పోలీసుల సమక్షంలోనే జరిగినా ఎవరూ మాట్లాడరు.. ఈ ఎన్నికల కోసం ఏరికోరి పోలీసులను విధులకు పంపారు.. పచ్చ చొక్కాలు వేసుకుని కూర్చున్నారు..

Also Read:Harassment: మహిళకు ఎస్సై లైంగిక వేదింపులు.. వీడియో కాల్ లో బట్టలు విప్పి..

డీఐజీ కోయా ప్రవీణ్ టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు సమీప బంధువు.. ఆయన ఆద్వర్యంలో ఇదంతా జరిగింది.. పచ్చ చొక్కా వేసుకున్న డీఐజీ కోయా ప్రవీణ్.. ప్రతీ అధికారికి ఆయన విధులు అప్పగించారు.. చంద్రబాబు మాట వినకుంటే డీజీ స్తాయి అధికారులు అయినా జైళ్లకే.. లేకుంటే కేసులు.. సస్పెండ్లు.. 55 మంది డీఎస్పీలకు పోస్టింగులు లేవు.. 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు.. ఆయనకు సంబంధించిన పోలీసులకు పోస్టింగులు ఇస్తున్నారు.. డీఐజీల ఆద్వర్యంలో కలెక్షన్ మాఫియా చేస్తున్నారు.. ఇసుక, మట్టి, ఖనిజాలు మొత్తం వాళ్ళ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి.. పెద్ద బాబుకు ఇంత.. చిన్నబాబుకు ఇంత అని సీఐ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.. టీడీపీకి సంబంధించిన కోయ ప్రవీణ్ అనే వ్యక్తి పర్యవేక్షణలో జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయా..

Also Read:Harassment: మహిళకు ఎస్సై లైంగిక వేదింపులు.. వీడియో కాల్ లో బట్టలు విప్పి..

తన ఇంట్లో ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు.. ఆయన అసలు పులివెందుల రూరల్ లో కూడా లేరు.. పోలింగ్ బూతులకు 2 కిలోమీటర్ల దూరంలోనే టీడీపీ నేతలు ఆపివేశారు.. మహిళా ఓటర్ల దగ్గరి నుంచి స్లిప్పులు తీసుకుని పంపివేశారు.. కన్నంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్ళి గన్ తో బెదిరించిన పోలీసులు.. ఏజెంట్లను పోలింగ్ బూత్ ల్లోకి రానివ్వకుండా అడ్డుకున్న బీటెక్ రవి తమ్ముడు శ్రీధర్.. ఓటు వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసుల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి.. తాము ఓటు వేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేసిన మహిళా ఓటర్లు..

పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్ధి హేమంత్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు కూడా రానివ్వలేదు.. ఓటరు లిస్టులో ఉంది యువకుడైనా.. వృద్దుడైనా చూడకుండానే దొంగ ఓట్లు వేయించారు.. రూరల్ లో ఎన్నికలు జరుగుతుంటే పులివెందుల టౌన్ లో ఉన్న పార్టీ కార్యాలయానికి వెళ్ళి డీఐజీ హడావుడి చేశాడు.. ఇక డీఎస్పీ కాల్చిపారేస్తా నా కొడకా అంటాడు.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనకు సంబంధం లేని బూత్ లోకి వెళ్ళి రౌడీయిజం చేశారు.. రాయచోటిలో ఉండే మంత్రికి ఒంటిమిట్టకు ఏం సంబంధం..

Also Read:Harassment: మహిళకు ఎస్సై లైంగిక వేదింపులు.. వీడియో కాల్ లో బట్టలు విప్పి..

చంద్రబాబుకి ప్రజలకు మంచి చేశామని నమ్మకం ఉంటే ఇదంతా ఎందుకు.. మీరు ప్రజలకు మేలు చేయలేదు కాబట్టే భయపడ్డారు.. 2017లో నంద్యాల బై ఎలక్షన్ ఇలాగే గెలిచి సంకలు గుద్దుకున్నారు. వైసీపీ పని అయిపోయిందని నన్ను, పార్టీని తిట్టించారు.. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత జరిగిన నంద్యాల ఎన్నికల్లో 37 వేల మెజారిటీ వచ్చింది.. కళ్లు మూసుకుని తెరిచే లోపు ఏడాదిన్నర అయిపోయింది.. మారో మూడేళ్లు ఆగితే డిపాజిట్లు కూడా రావు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే నక్సలిజం అక్కడి నుంచే పుడుతుంది.. ఇప్పటికైనా కళ్లు తెరవండి.. చంద్రబాబు కు హితవు పలుకుతున్నా..

Also Read:BR Gavai: వీధి కుక్కల తీర్పుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక ప్రకటన

తప్పుడు పనులకు పునాది వేస్తున్నారు.. మీరు చేసిన దుర్మార్గాలు, కక్ష్యలు, కార్పణ్యాలు మీకు చుట్టుకుంటాయి.. ఇప్పటికైనా మార్చుకో చంద్రబాబు.. బహుశా మీకు ఇవే చివరి ఎన్నికలు కావచ్చు.. కృష్ణా, రామా అనుకోవాల్సిన వయస్సులో ఇదంతా ఎందుకు.. స్టేట్ ఎలక్షన్ కమిషన్ డమ్మీ పాత్ర పోషిస్తుంది.. దిగజారిపోయిన వ్యవస్త మధ్య ఇదంతా నడుస్తుంది.. కోర్టులకు అన్నీ ఆధారాలతో చూపిస్తాం.. రెండు స్థానాల అభ్యర్ధులు అందుకే వచ్చారు.. వాళ్ళు కోర్టుకు అన్నీ ఆధారాలతో న్యాయస్థానానికి వెళ్తారు.. ఈవీఎంల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు వివరించాం.. దాదాపు 12.5 శాతం ఓట్ల తేడా ఉంది..

Also Read:Defence Forces In KBC 17: కేబీసీ 17 వేదికపై ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ అధికారులతో అమితాబ్ బచ్చన్

దాదాపు 48 లక్షల ఓట్ల తేడా ఉంది.. అప్పుడు అన్నీ సానుకూలంగా చెప్పారు.. రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్రా గురించి ఎందుకు మాట్లాడలేదు.. చంద్రబాబు తో టచ్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడటం లేదు.. ఏపీ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ ఎప్పుడైనా టీడీపీ గురించి, చంద్రబాబు గురించి మాట్లాడారా.. రేవంత్ కాల్ చంద్రబాబు.. చంద్రబాబు కాల్ హైకమాండ్.. ఏపీ ఓటు చోరీ గురించి మాట్లాడరు.. చంద్రబాబు, రేవంత్, హైకమాండ్ హాట్ కాలింగ్ లో ఉన్నారు.. ఎన్ని స్కాంలు జరిగినా ఏపీ గురించి రాహుల్ మాట్లాడరు అంటూ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Exit mobile version