YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Emotional Tweet on YSR Vardhanthi 2026: దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రిని స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశారు. వైఎస్సార్ తనకు ఎప్పటికీ స్ఫూర్తిగానే ఉంటారని, ఆయన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ తనతోనే ఉంటాయని పేర్కొన్నారు.
‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. మీరు ఎప్పటికీ నా స్ఫూర్తి. మీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తండ్రిపై తనకున్న అనుబంధాన్ని, అభిమానాన్ని మరోసారి వ్యక్తం చేశారు. అంతకుముందు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ నివాళులు అర్పించారు. తండ్రి సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రబి వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. వైఎస్సార్ చేసిన సేవలను, ఆయన పాలనలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2న ఆయన వర్ధంతిని కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
Miss you always, Dad! You’ll forever be my inspiration. pic.twitter.com/4e9pkYxlem
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2026
తాజావార్తలు
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!