Site icon NTV Telugu

YS Jagan: నా ప్రతి అడుగులో నువ్వే నా స్ఫూర్తి.. మాజీ సీఎం ఎమోషనల్ పోస్ట్..!

Ys Jagan

Ys Jagan

YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘ఫాదర్స్ డే’ సందర్భంగా తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని భావోద్వేగంతో స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ (X) వేదికగా ఓ ప్రత్యేక పోస్ట్ చేశారు. “మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తి, నాకు నా ప్రతి అడుగులో నువ్వే నా స్ఫూర్తి.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న” అంటూ వైఎస్సార్‌ ఫోటోను జత చేశారు.

Read Also: Yanamala Rama Krishnudu: గతంలో నిద్రపోయారా..? సోకాల్డ్ సంపాదకులపై యనమల ఫైర్..!

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇదివరకు ఓ సారి తన తండ్రి చారిత్రాత్మకమైన పాదయాత్ర ముగిసిన రోజును కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబానికే కాదు, రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపి, సంక్షేమానికి బాటలు వేసిన మహానేతగా వైఎస్‌ను జగన్ మరోసారి జ్ఞాపకం చేసుకున్నారు. జగన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో అభిమానులు, పార్టీ కార్యకర్తలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సైతం పంచుకుంటూ, వైఎస్సార్ సేవలను స్మరించుకుంటున్నారు.

Read Also: Buggana Rajendranath: ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని సీఎం.. మాజీ మంత్రి ఫైర్..!

Exit mobile version