YS Jagan: ఇళ్ల కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలి..!
- విజయవాడ భవానీపురంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన
- జోజీనగర్లో ఇళ్లు కోల్పోయిన 42 కుటుంబాలను పరామర్శించిన జగన్
- సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే ఇళ్ల కూల్చివేత జరిగిందని ఆరోపణ
- ఈ నెల 31 వరకు స్టే ఉన్నప్పటికీ అధికార దుర్వినియోగం జరిగిందని విమర్శ
- 2.17 ఎకరాల భూమి విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుందని వెల్లడి
- భవానీపురం ఇళ్ల కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
- ఫేక్ సొసైటీ, భూకబ్జాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలని డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: విజయవాడ భవానీపురంలో వైఎస్ జగన్ పర్యటించారు. భవానీపురంలోని జోజీనగర్ లో 42 ప్లాట్ల బాధితులను ఆయన పరామర్శించారు. భవానీపురంలో ఇటీవల ఇళ్లను కోల్పోయిన 42 కుటుంబాల తరుపున ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని.. ఈనెల 31వ తేదీ వరకు 42 కుటుంబాలకు సుప్రీం కోర్టు ఊరట ఇచ్చిందన్నారు. అయితే పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఇళ్లను కూల్చేశారని.. 31వ తేదీ వరకు గడువు ఉన్నా అధికార దుర్వినియోగం చేసారని మండిపడ్డారు. ఇళ్లు కూల్చేసి 42 కుటుంబాలను రోడ్డుపాలు చేశారన్నారు. 2.17 ఎకరాల విలువ రూ.150కోట్లు పైగా ఉంటుందని.. 42 కుటుంబాలు 25ఏళ్లుగా ఇక్కడే ఇళ్లు కట్టుకుని ఉంటున్నాయని, వాళ్ల ఇళ్లను ధ్వంసం చేసారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
TGTET 2026: టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. జనవరి 3 నుంచి ఆన్లైన్ పరీక్షలు..
Also Read
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
2016లో 1981 డేట్ తో తప్పుడు డాక్యుమెంట్లతో తప్పుడు సొసైటీ క్రియేట్ చేసారని.. 2.17 ఎకరాలు కాజేసేందుకు కుట్ర చేశారన్నారు. ఇందులో లోకేష్, కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ సోదరుడు ఇన్వాల్వ్ అయ్యారంటూ.. ఈ ఇళ్లకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి ఉందని తెలిపారు. బ్యాంకులు ఇళ్లు కట్టుకునేందుకు వీళ్లకు లోన్లు కూడా ఇచ్చాయని, స్థలం ఇంకొకరిదే అయితే రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని, అలాగే స్థలం ఇంకొకరిదే అయితే కరెంట్, డ్రైనేజ్ పర్మిషన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని.. ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇచ్చి జేసీబీలతో ఇళ్లు కూల్చేస్తారా..? స్థలం క్రమవిక్రయాలు జరిగే సమయంలో అభ్యంతరాలు ఉంటే చెప్పమని పేపర్ ప్రకటనలు కూడా ఇచ్చారన్నారు. అయితే అప్పుడు ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. చంద్రబాబు, లోకేష్, కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ అంతా ఒక్కటై కుట్ర చేసారని జగన్ అన్నారు.
Pawan Kalyan : OG డైరెక్టర్ సుజిత్ కు పవర్ స్టార్ ఖరీదైన గిఫ్ట్
అన్యాయంగా పేదల ఇళ్లను కూల్చేశారని.. భవానీపురంలోనే కాదు ఇలాంటి అన్యాయాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని జగన్ తెలిపారు. లిటికేషన్ ఉన్న భూములను అధికార పార్టీ నేతలే కబ్జా చేయిస్తున్నారని.. కొన్ని చోట్ల అధికార పార్టీ వాళ్లే లిటికేషన్ క్రియేట్ చేస్తున్నారని జగన్ మాట్లాడారు. భవానీపురం ఇళ్ల కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలని.. ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి పేద ప్రజల ఆస్తులపై ఎలా కన్నేశారో తేలాలని వైఎస్ జగన్ కోరారు.
తాజావార్తలు
-
DC Release Date: గ్యాంగ్‌స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
ISIS-K: మసీదులు, పాఠశాలలు, మైనారిటీ వర్గాలే టార్గెట్.. తాలిబన్లకు అతిపెద్ద శత్రువు!
-
Abhishek Sharma: టీ20ల్లో సిక్సర్ కింగ్‌గా అభిషేక్ శర్మ.. చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్
-
Explainer: ప్రతి ముగ్గురిలో ఒకరికి సోకుతుంది.. కంటి చూపును దెబ్బతీస్తుంది.. గర్భంలోని శిశువుకూ ముప్పు!
-
Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!