Site icon NTV Telugu

YS Jagan: “అధైర్య పడొద్దు”.. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన జగన్…

Jagan

Jagan

నిన్న ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణరెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన నారాయణరెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపడంతో పరువు పోయిందని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

READ MORE: Kannappa : కన్నప్పలో రజినీకాంత్ ను తీసుకుందామనుకున్నా.. విష్ణు కామెంట్స్ వైరల్

అరెస్టు సమయంలో డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులు తీవ్రంగా హింసించారని వైఎస్ జగన్ కు కుటుంబ సభ్యులు తెలిపారు. పూలు అమ్ముకుని జీవించే నారాయణరెడ్డి మరణంతో భార్య, ఇద్దరి పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి మారింది. అధైర్య పడవద్దని కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఓదార్చారు. వారి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకూ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

READ MORE: Bhuma Akhila: రెడ్ బుక్‌ను తలుచుకొని జగన్ భయపడుతున్నారు.. భూమా అఖిల ఫైర్…

Exit mobile version