NTV Telugu Site icon

YS Jagan: సీతారాం ఏచూరి మృతిపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

Jagan

Jagan

YS Jagan: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం వామపక్ష భావాలతో గడిపిన ఆయన, దేశ ప్రగతి కోసం నిర్విరామంగా చొరవ చూపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించిన సీతారామ్‌ ఏచూరి, స్వశక్తితో జాతీయస్థాయికి ఎదిగారని, విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలు కనబర్చారని గుర్తు చేశారు. సీపీఎంలోనూ నాయకత్వ లక్షణాలు చూపి, పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక పొలిట్‌బ్యూరో సభ్యుడిగానూ, పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ పని చేశారని తెలిపారు. సీతారాం ఏచూరి మృతి, దేశ రాజకీయాల్లో తీరని లోటన్న వైయస్‌ జగన్.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read Also: Sitaram Yechury: సీతారాం ఏచూరి జీవిత విశేషాలు, రాజకీయ ప్రస్తానం…