కమ్యూనిస్ట్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సీతారాం ఏచూరి కన్నుమూశారు.. ఆయన జీవిత విశేషాలు గురించి తెలుసుకుందాం.
మద్రాస్ (ప్రస్తుతం చెన్నై)లో 12 ఆగస్టు 1952న జన్మించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజినీర్ గా పనిచేశారు. తల్లి ప్రభుత్వ ఉద్యోగి.
ఏచూరి బాల్యం మొత్తం హైదరాబాద్‌లో గడిపారు. ఆల్‌సెయింట్స్ హైస్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు.
ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌లో 12వ తరగతి, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ ఆనర్స్, జేఎన్‌యూలో ఎంఏ ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు.
1974లో ఎస్‌ఎఫ్‌ఐలో చేరిన ఏచూరి.. 1975 ఎమర్జెన్సీ టైమ్‌లో అరెస్ట్ కావడంతో స్టడీకి ఫుల్‌స్టాప్ పెట్టారు.
ఎమర్జెన్సీ టైమ్‌లో ఏచూరి అండర్‌గ్రౌండ్‌కు వెళ్లారు. 1977-78 మధ్య జేఏన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1978లో ఎస్‌ఎఫ్‌ఐకి జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1984లో సీపీఎం కేంద్ర కమిటీలోకి ఎంట్రీ ఇచ్చారు.
1985లో పార్టీ రాజ్యాంగ సవరణలో కీలక పాత్ర పోషించారు. 1992లో జరిగిన 14వ కాంగ్రెస్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ప్రమోషన్ పొందారు.
2005 నుంచి 2015 వరుసగా మూడు సార్లు ప్రధాన కార్యదర్శిగా.. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు.
1992 నుంచి ఏచూరి సీపీఎంలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. 2005-2017 వరకు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
హిందుస్థాన్ టైమ్స్‌లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాలమ్.. 20 ఏళ్లుగా పార్టీ పత్రిక పీపుల్స్ డెమోక్రసీ ఎడిటోరియల్ బోర్డు మెంబర్ గా పని చేశారు.