Site icon NTV Telugu

YS Jagan: పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టానే.. సీఎం నో యాక్షన్‌!

Ys Jagan Statement

Ys Jagan Statement

పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టా మహేషే అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ఈ వ్యవహారం పుట్టా మహేష్‌తో మొదలై, పుట్టా మహేష్‌తో ఆగిపోలేదన్నారు. ఇలాంటి వాటిపట్ల సీఎం చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణం అని మండిపడ్డారు. తప్పు చేసిన వారిపట్ల చంద్రబాబు చర్యలు తీసుకోలేదని, అందుకే రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ దందాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం అత్యాచారాలు, మోసాలపై కమిటీలు వేసి కాలయాపన చేస్తోందన్నారు. కోనేటి ఆదిమూలం మహిళపై లైంగిక దాడిచేస్తే చర్యలు లేవని వైఎస్ జగన్ మండిపడ్డారు.

‘డ్రగ్స్‌ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ పట్టుబడ్డాడు. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ఆయనే. పుట్టా మహేష్‌తో మొదలై.. పుట్టా మహేష్‌తో ఆగిపోలేదు. ఇలాంటి వాటిపట్ల సీఎం చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణం. ఒక పాలకుడిగా ఆయన వ్యవహరించలేదు. తప్పు చేసిన వారిపట్ల తయన చర్యలు తీసుకోలేదు. అందుకనే విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అత్యాచారాం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు స్వయంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే.. దానిపై కమిటీలు అంట. కోనేటి ఆదిమూలం మహిళ మీద దారుణమైన లైంగిక దాడిచేస్తే పంచాయితీ చేశారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్‌ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మీద నో యాక్షన్‌. మహిళలతో అశ్లీల వీడియో కాల్స్‌ చేసిన గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే మీద నో యాక్షన్‌. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీదా నో యాక్షన్. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌ మీదా నో యాక్షన్‌. వీడియో, ఫొటోలతో పట్టుబడ్డా.. నో యాక్షన్‌’ అంటూ వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.

Also Read: Mahesh Kumar Goud: డ్రగ్ టెస్టుకు సీఎం సిద్ధం.. మరి కేటీఆర్ సిద్దమా?

‘ఆదినారాయణ రెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే నో యాక్షన్‌. ఇలాంటి వాటికి వత్తాసు పలికే భావన సీఎం చంద్రబాబుకు ఉంది కాబట్టే.. ఇలాంటివి జరుగుతున్నాయి. తన కొడుకు స్విమ్మింగ్‌ పూల్స్‌ వద్ద తాగుతూ, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్‌లు చూస్తే నో యాక్షన్‌. తన బావమరిది అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని అని బహిరంగంగా మాట్లాడితే నో యాక్షన్‌. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మైండ్‌ సెట్‌ ఎలాంటిదో ఇవన్నీ సూచిస్తున్నాయి. వీళ్లువరికీ కూడా ప్రజలకు మంచి చేయాలన్న మైండ్‌ సెట్‌ లేదు. చంద్రబాబు వచ్చి రెండేళ్లు అయిపోయింది. ఇక మిగిలింది రెండేళ్లే. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికలున్నాయి. మధ్యలో నా పాదయాత్ర కూడా ఉంటుంది. జగన్‌ 2.Oలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తా. కార్యకర్తల ద్వారానే ప్రజలకు మరింత మంచి జరుగుతుంది’ అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

Exit mobile version