YS Bharathi Reddy: పులివెందులలో సీఎం జగన్ తరఫున ఆయన సతీమణి వైఎస్ భారతి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గడపగడపకు వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. వైసీపీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వైఎస్ భారతి వివరిస్తున్నారు. సంక్షేమం కొనసాగాలన్నా.. పథకాలు అమలు జరగాలన్నా వైసీపీతోనే సాధ్యమని చెబుతున్నారు. పులివెందులలో వైసీపీకి భారీ మెజార్టీ వస్తుందని.. వైసీపీ మెజార్టీని ఎవరూ అడ్డుకోలేరని అంటున్నారు వైఎస్ భారతి. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందని వస్తోందని చెబుతున్నారు. పులివెందుల ప్రజలు ఎప్పుడూ తమ వెంటే ఉన్నారని వైఎస్ భారత్ చెప్పారు. ప్రజల ఆదరణ చూస్తుంటే ఈ సారి భారీ మెజారిటీ రావడం ఖాయమైందన్నారు వైఎస్ భారతి.
Read Also: CM YS Jagan: పేదలకు మేలు చేశానని అనిపిస్తేనే ఓటు వేయండి..
వైఎస్సార్ బ్రతికున్నప్పటి నుంచి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని.. ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. పులివెందుల ప్రజలు పడుతున్న బ్రహ్మరథాన్ని బట్టి చూస్తే అర్థమవుతుందన్నారు. జగన్ మాట ఇస్తే అమలు చేసి తీరుతారని.. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మరిచిపోవడం ఆయన నైజమన్నారు. ప్రచారంలో ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరించారు. జగన్మోహన్ రెడ్డికి ఒక ఓటు, అవినాష్ రెడ్డికి ఒక ఓటు వేయాలని వైఎస్ భారతి అభ్యర్థించారు. మహిళలతో మమేకమవుతూ వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ భారతికి మహిళలు ఘనంగా స్వాగతం పలికారు.