Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ యూట్యూబర్లు నందు, మధు దంపతుల వీసా మోసాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో ఒక కీలకమైన అలెర్ట్ పోస్ట్ చేశారు. ‘నందూస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానల్ ద్వారా లగ్జరీ లైఫ్‌స్టైల్ చూపిస్తూ, అమాయక నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకోవడానికి కొందరు యూట్యూబర్స్ ప్రయత్నిస్తున్నారని పోలీసులు స్పందించారు. విదేశాల్లో ఉద్యోగాలు, వీసాల పేరుతో జరిగే మోసపూరిత వలలో చిక్కుకోవద్దని నిరుద్యోగులను హెచ్చరించారు.
రూ.15 లక్షల మోసం..
లండన్ నుంచి వచ్చిన శివ క్రాంతి కుమార్ అనే యువకుడు తన వీసా రెన్యువల్, భార్య ఉద్యోగం కోసం ఈ దంపతుల ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ని నమ్మి రూ.15 లక్షలు ఇచ్చి మోసపోయారు. నిందితులు ‘అగార్డ్ సొల్యూషన్స్’ పేరుతో ఒక నకిలీ స్పాన్సర్షిప్ లెటర్ (COS) సృష్టించినట్లు తేలింది. బాధితుడి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు మధుకర్ (A1), రమానందన (A2), మోహన్‌రావు (A3)లపై కేసు నమోదు చేశారు. నిందితులు విచారణకు సహకరించకపోవడంతో శుక్రవారం వీరికి లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
- IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..

తాజాగా.. తెలంగాణ పోలీసులు తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇలాంటి వీసా మోసాలకు పాల్పడేవారికి భారత ఇమ్మిగ్రేషన్ చట్టాలు, BNS చట్టాల ప్రకారం 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని పోస్ట్ చేశారు. ఒకవేళ మీరు వీసా స్కామ్‌లో బాధితులైతే, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా సీసీఎస్ (CCS) లో రిపోర్ట్ చేయాలన్నారు.
కన్సల్టెన్సీ పేరు, యజమాని వివరాలతో పాటు మీ దగ్గర తీసుకున్న డబ్బుల రుజువులతో భారత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కి, సీబీఐ (CBI) కి ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా ఆ కన్సల్టెన్సీ లేదా యజమానులకు సంబంధించిన ఆస్తులను సీజ్ చేసే అవకాశం ఉంటుంది. నోరు తెరిస్తే విదేశీ ముచ్చట్లు చెప్పే ఇలాంటి కన్సల్టెన్సీలు, యూట్యూబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!