Youth Icon For Loksabha Polls: ఒక్కరోజు మీ వంతు వచ్చినప్పుడు ఓటు వేయండి అంటున్న హీరో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం దేశం మొత్తం 7 దశల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్, జూన్ 1న చివరి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక ఆ తర్వాత జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తోపాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలలో అన్ని స్థానాలకు 4 వ దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
Also read: Sushil Modi: గత 6 నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాను.. అందుకే పోటీ చేయడం లేదు..!
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఇందుకు సంబంధించి ఏప్రిల్ 18ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుండగా ఏప్రిల్ 25 వరకు ఆ నామినేషన్లు స్వీకరిస్తారు. ఇక వాటికీ సంబంధించి 26న నామినేషన్ల పరిశీలన, ఆపై ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువును ఇచ్చింది. ఇక ఇందుకు సంబంధించి 4 వ విడతలో మే 13న పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు ఆంధ్రాలో కూడా ఎన్నికలు జరగనున్నాయి.
Also read: Sushil Modi: గత 6 నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాను.. అందుకే పోటీ చేయడం లేదు..!
ఇకపోతే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ భారతదేశ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జరగనుంది. దీనికి గాను తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానాను కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్ గా నియమించింది. ఎన్నికల సమయంలో ఓటు విలువ తెలపడంతో పాటు యువ ఓటర్లను చైతన్యపరిచేందుకు ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం ‘యూత్ ఐకాన్’ గా నియమించామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇందులో ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఇందుకు సంబంధించి వీడియోలో ఆయుష్మాన్ మాట్లాడుతూ.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని దేశ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు ఆయన. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, అలాంటి పరిస్థితుల్లో రోజు, తేదీలను బట్టి కచ్చితంగా ఒక్కరోజు మీ టైం వచ్చినప్పుడు ఓటు వేయాలని కోరారు.
Election Day: No Excuse Day!
Join the celebration of #ChunavKaParv with @ayushmannk, Actor and Youth Icon, urging the youth to set aside excuses and come out to vote.
From reel to real, let's script the democracy together! 🤝#YouAreTheOne #DeshKaGarv #LokSabhaElections2024 pic.twitter.com/SvmuzZns10
— Election Commission of India (@ECISVEEP) April 2, 2024
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!