NTV Telugu Site icon

Youth Icon For Loksabha Polls: ఒక్కరోజు మీ వంతు వ‌చ్చిన‌ప్పుడు ఓటు వేయండి అంటున్న హీరో..!

12

12

దేశంలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. మొత్తం దేశం మొత్తం 7 దశల్లో ఈ ఎన్నికలు జరగనుండ‌గా.. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్‌, జూన్‌ 1న చివరి విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇక ఆ తర్వాత జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తోపాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఇక తెలంగాణ‌ రాష్ట్రంలలో అన్ని స్థానాలకు 4 వ దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

Also read: Sushil Modi: గత 6 నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాను.. అందుకే పోటీ చేయడం లేదు..!

ఇందుకు సంబంధించి ఏప్రిల్‌ 18ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేస్తుండగా ఏప్రిల్‌ 25 వరకు ఆ నామినేషన్లు స్వీకరిస్తారు. ఇక వాటికీ సంబంధించి 26న నామినేషన్ల పరిశీలన, ఆపై ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువును ఇచ్చింది. ఇక ఇందుకు సంబంధించి 4 వ విడతలో మే 13న పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదేరోజు ఆంధ్రాలో కూడా ఎన్నికలు జరగనున్నాయి.

Also read: Sushil Modi: గత 6 నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాను.. అందుకే పోటీ చేయడం లేదు..!

ఇకపోతే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ భార‌త‌దేశ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జరగనుంది. దీనికి గాను తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానాను కేంద్ర ఎన్నిక‌ల సంఘం యూత్ ఐకాన్‌ గా నియ‌మించింది. ఎన్నికల సమయంలో ఓటు విలువ తెల‌పడంతో పాటు యువ ఓటర్లను చైతన్యపరిచేందుకు ఆయ‌న‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ‘యూత్ ఐకాన్’ గా నియ‌మించామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇందులో ఒక వీడియో కూడా విడుద‌ల చేసింది. ఇందుకు సంబంధించి వీడియోలో ఆయుష్మాన్ మాట్లాడుతూ.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అందరూ త‌మ ఓటు హక్కు వినియోగించుకోవాలని దేశ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు ఆయన. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, అలాంటి పరిస్థితుల్లో రోజు, తేదీలను బట్టి కచ్చితంగా ఒక్కరోజు మీ టైం వ‌చ్చిన‌ప్పుడు ఓటు వేయాలని కోరారు.

Show comments