Site icon NTV Telugu

UP: ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో.. ప్రైవేట్ పార్ట్‌పై బెల్ట్‌తో కొడుతూ చిత్రహింసలు (వీడియో)

Up News

Up News

యూపీలోని డియోరియాలో మొబైల్ దొంగతనం చేశాడనే అనుమానంతో ఒక యువకుడిని దారుణంగా కొట్టారు. అతడి ప్రైవేట్ భాగంపై బెల్టుతో కొట్టి మరీ కక్ష తీర్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వైరల్ వీడియోలో బాధితుడిని సోఫాలో బోర్ల పడుకోబెట్టారు. ఒక వ్యక్తి తలపై కూర్చున్నాడు. మరొక వ్యక్తి బాధితుడి వీపు కింది భాగంపై బెల్టుతో దెబ్బల వర్షం కురిపిస్తున్నాడు. అక్కడే ఉన్న మూడవ వ్యక్తి ఈ సంఘటనను తన మొబైల్‌లో రికార్డ్ చేశాడు.

READ MORE: Centre To Supreme: “రాజకీయ దోషుల” జీవితకాల నిషేధంపై కేంద్రం సంచలన నిర్ణయం..

ఈ వీడియోను యువకుడిని కొట్టిన వ్యక్తులే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారని చెబుతున్నారు. ఈ వీడియో డియోరియాలోని సాలెంపూర్ కొత్వాలి పోలీసులకు దృష్టికి వచ్చింది. ఇది చూసి పోలీసు శాఖలో కలకలం రేగింది. నిందితులను అరెస్టు చేయడానికి వెంటనే బృందాలను మోహరించారు. బుధవారం, డియోరియా పోలీసులు ఓ యువకుడిని అరెస్టు చేశారు. అతని పేరు రోహిత్ శ్రీవాస్తవ, సాలెంపూర్ నివాసి అయిన అశోక్ లాల్ శ్రీవాస్తవ కుమారుడు. బాధితుడి తలపై కూర్చున్న రెండవ నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. అతని పేరు ప్రియాంషు సింగ్. డియోరియా పోలీసులు నిందితులపై తీసుకుంటున్న చర్యల గురించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ “ఎక్స్” ద్వారా సమాచారం అందించారు.

READ MORE: CM Revanth Reddy : ముగిసిన ప్రధాని మోడీతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. చర్చించిన అంశాలివే..!

Exit mobile version