Site icon NTV Telugu

Hyderabad: ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడి ఆత్మహత్యాయత్నం..

Loves

Loves

ప్రేమించిన యువతి ఇంటి ముందు ప్రేమికుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ లింగంపల్లికి చెందిన సోను (21) డిగ్రీ స్టూడెంట్. హౌసింగ్ బోర్డ్ కాలనీ, బృందావనం కాలనీకి చెందిన అంబిక (21) ఎల్‌ఎల్‌బీ స్టూడెంట్. ఇద్దరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.

READ MORE: Megabook S14: ప్రపంచంలోనే తక్కువ బరువున్న ల్యాప్‌ట్యాప్‌ లాంచ్..

ప్రియురాలు ప్రియుడ్ని కాదనడంతో మనస్థాపన చెందిన ప్రియుడు గురువారం ప్రేయసి ఇంటి ముందు ఉన్న మొదటి అంతస్తు పై ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ సృష్టించాడు. ఫ్లోర్ క్లీనర్ త్రాగాడు. స్థానికులు గమనించి 100కు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. మొదటి అంతస్తు పైకెక్కి హల్చల్ చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే 108 కి ఫోన్ చేశారు. అంబులెన్స్ లో అతనికి ప్రథమ చికిత్స చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE: Megabook S14: ప్రపంచంలోనే తక్కువ బరువున్న ల్యాప్‌ట్యాప్‌ లాంచ్..

Exit mobile version