Kidnap: ఇటీవల ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులను కూడా మోసం చేస్తున్నారు. కుటుంబ సమస్యలు, ఆస్తి గొడవల వ్యవహారంలో అత్తను సొంత కోడలు కిడ్నాప్ చేసి నానా హింసలు పెట్టింది. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం మన్నూరులో ఆస్తి కోసం వృద్ధురాలిని కిడ్నాప్ చేసింది. తన బంధువులచే అత్త లక్ష్మి నరసమ్మను చిన్న కోడలు కిడ్నాప్ చేయించింది. కువైట్‌లో ఉన్న కొడుకుకు సీఐడీ పోలీసుల పేరిట ఫోన్ బెదిరింపులు కూడా చేయించింది. వారం రోజుల క్రితం అత్త లక్ష్మి నరసమ్మను కిడ్నాప్ చేసి రాయచోటికి తరలించి చిత్రహింసలు పెట్టింది. తన ఆస్తి వారి పేరిట ఉన్న పేపర్లలో బలవంతంగా వేలి ముద్రలు వేసుకొని, నాలుగు తులాల సరుడు, ఐదు గ్రాముల కమ్మలు,సెల్ ఫోన్ దౌర్జన్యంగా లాక్కుని కిడ్నాపర్లు వదిలి వేశారు. ఈ క్రమంలోనే అత్త లక్ష్మీనరసమ్మ పోలీసులను ఆశ్రయించింది. కోడలిపై చట్ట పరమైన చర్యలు తీసుకొని వారి నుంచి తనని రక్షించమని పోలీసులకు అత్త లక్ష్మి నరసమ్మ ఫిర్యాదు చేసింది. అత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Read Also: Ghaziabad : ఇద్దరు భర్తలను విడిచిపెట్టి.. బావతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్.. కట్ చేస్తే