ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతిని కిడ్నాప్ చేసి ఆపై దారుణంగా హత్య చేశారు. రాత్రి స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన బరేలీలోని హఫీజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతి చెందిన యువతిని లక్ష్మి (22)గా గుర్తించారు.
Read Also: Andhra Pradesh: జీపీఎస్ జీవో, గెజిట్ వెనక్కి తీసుకోవడంపై ఉద్యోగుల హర్షం
వివరాల్లోకి వెళ్తే.. సర్దార్ నగర్ గ్రామానికి చెందిన యువతి లక్ష్మి తన కజిన్ సోదరి సప్నాతో కలిసి స్కూటీపై షాపింగ్‌కు వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా.. హఫీజ్‌గంజ్ ప్రాంతంలోని పిలిభిత్ హైవేపై తమ స్కూటర్ దగ్గర ఓ కారు ఆగిందని మృతురాలి సోదరి సప్నా చెప్పింది. ఆ కారులో వ్యాపారవేత్త మోను గుప్తా, అతని భార్య కారులో ఉన్నట్లు తెలిపారు. అయితే తన స్కూటీపై ఉన్న లక్ష్మిని వ్యాపారవేత్త కారులో ఎక్కించుకున్నాడు. లక్ష్మి కూడా సప్నతో కొంచెం సేపు వేయిట్ చేయి.. త్వరగా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయిందని సప్నా చెప్పింది.
Read Also: CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం భేటీ.. కీలక ఆదేశాలు
ఎంతసేపటికి లక్ష్మి తిరిగి రాకపోవడంతో సప్న కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. రాత్రంతా లక్ష్మి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తీరా చూస్తే.. తెల్లవారుజామున యువతి మృతదేహం రోడ్డుపై కనిపించింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం.. నిందితుడు వ్యాపారవేత్త మోను గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. యువతి మృతదేహంపై గొంతు కోసి ఉంది.. తన వేళ్లు కట్ చేసినట్లుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తన కూతురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. తన కూతురిని హత్య చేసిన వారిని తీవ్రంగా శిక్షించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.